manatelanganatv.com

సబ్బండవర్ణాలకు మిగిలింది వేదనే

కూల్చివేతలు.. తొలగింపులు.. ఎగవేతలు.. హడావుడి నిర్ణయాలు.. అసంబద్ధ విధానాలు.. బెదిరింపులు.. నిర్బంధాలు.. అరెస్టులు.. అర్ధరాత్రి ఆగడాలు.. వెరసి కూలిన పేదల బతుకులు ఆవిరైన ఆశలు.. రోడ్డుపాలైన జీవితాలు.. గాల్లో కలుస్తున్న విద్యార్థుల ప్రాణాలు.. కల్లలైపోతున్న నిరుద్యోగుల కలలు.. కంటిమీద కునుకులేని రాత్రులు. ప్రజాపాలన ఏడ్పులతో సాగుతున్నది. రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యోగార్థులు, దగాపడ్డ రైతులు, దాడులకు గురవుతున్న దళిత, గిరిజనులు, దివ్యాంగులు, అంగన్‌వాడీలు, ఆటోవాలాలు.. ఒక్కరేమిటి సబ్బండవర్గాలు కాంగ్రెస్‌ పాలనలో కంటతడి పెడుతున్నాయి.

కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిన లక్షలోపు రుణమాఫీ అందరికీ కాలేదు. రూ.70వేల రుణం మాఫీ కాకపోవడంతో మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ ప్రజావాణిలో రోదిస్తున్న చంద్రాస్‌పల్లి గ్రామానికి చెందిన రైతు వడ్డే చంద్రయ్య, కుటుంబ సభ్యులు

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం ఆదర్శనగర్‌లోని దాదాపు 70మంది దివ్యాంగుల ఇండ్లను మున్సిపల్‌ అధికారులు కూల్చగా, కూలిన ఇంటి నుంచి సామగ్రి తీసుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బాధిత మహిళ

జిల్లా: రంగారెడ్డి తేది: అక్టోబర్‌ 3
తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ ఎదుట ఆవేదన వెళ్లగక్కుతున్న మూసీ బాధితురాలు

జిల్లా: మహబూబ్‌నగర్‌ తేది: ఆగస్టు 29
మహబూబ్‌నగర్‌ ఆదర్శనగర్‌లో దివ్యాంగులకు చెందిన 70ఇండ్లను మున్సిపల్‌ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే రాత్రికిరాత్రే కూల్చివేశారు. గూడు చెదిరి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బాధిత దివ్యాంగుడు భోజ్యానాయక్‌, అతని కుమార్తె

జిల్లా: రంగారెడ్డి తేది: సెప్టెంబర్‌ 28
తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు తన గోడు చెబుతూ కన్నీటిపర్యంతమైన హైడ్రా బాధితురాలు
జిల్లా: వికారాబాద్‌ తేది: నవంబర్‌ 14
వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలో ఫార్మా కంపెనీల కోసం రైతుల భూములు లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నిరసన తెలిపిన లగచర్ల రైతును అర్ధరాత్రి పోలీసులు పట్టుకెళ్లగా రోదిస్తూ వివరాలు వెల్లడిస్తున్న రైతు భార్య జ్యోతీబాయి

జిల్లా: వికారాబాద్‌ తేదీ: నవంబర్‌18
పోలీసులు ఇళ్లలోకి చొరబడి తమవారిని అరెస్టు చేయడంతో మీడియాతో మాట్లాడుతూ రోదిస్తున్న లగచర్ల బాధితురాలు దేవీబాయి

జిల్లా: రంగారెడ్డి తేది: సెప్టెంబర్‌22
కూకట్‌పల్లి నల్లచెరువు వద్ద హైడ్రా అధికారులు కూల్చివేతలకు పాల్పడగా ఉన్న ఉపాధి మార్గం కోల్పోయి రోడ్డుపాలై రోదిస్తున్న జీఆర్‌ సింబల్స్‌ డిజిటల్స్‌ యజమాని రవి, కుటుంబసభ్యులు
జిల్లా: రంగారెడ్డితేది: అక్టోబర్‌ 18
గ్రూప్‌ 1 పరీక్ష రీ షెడ్యూల్‌ చేయాలని నిర్వహించిన ఆందోళనలో రోదిస్తున్న నిరుద్యోగిc

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278