డ్రగ్స్ తీసుకున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మేడ్చల్ పట్టణానికి చెందిన కొందరు వ్యాపారస్తులు జన్మదిన సంధర్బంగా రాజస్థాన్ నుండి డ్రగ్స్ ను కొనుగోలు చేసి సేవిస్తున్నారని పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ కొనడం సేవించడం నేరమని ఇలాంటి అలవాట్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు
0