తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ ఎస్ జగత్రక్షకన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు రూ. 908 కోట్ల జరిమానా విధించింది.
విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఈ భారీ జరిమానా విధించినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఈ నెల 26వ తేదీన వచ్చిన తీర్పుకు లోబడి ఈ చర్యలకు ఉపక్రమించింది.
అలాగే ఫెమా చట్టంలోని 37ఏ సెక్షన్ ప్రకారం 2020 సెప్టెంబర్లో సీజ్ చేసిన రూ. 89.19 కోట్లను కూడా జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఇదిలాఉంటే.. వ్యాపారవేత్త అయిన జగత్రక్షకన్ ప్రస్తుతం అరక్కోణం పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభ ఎంపీగా కొనసాగుతున్నారు.