మేడ్చల్ లో బిజెపి శ్రేణులు తమ మంద బలం చూపుకునేందుకు ప్రలోభాల పర్వం సాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం మేడ్చల్ పట్టణంలో మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తమకు ప్రజల మద్దతు ఉంది… తమకు ప్రజల అండ మెండుగా ఉందని చూపుకునేందుకు పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలను కార్యక్రమానికి తీసుకువచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత వచ్చిన వారికి డబ్బులు పంచారు. ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అటు వైపు కన్నెత్తి చూడలేదు.ఇలా పెద్ద ఎత్తున డబ్బులకు ప్రజలను తీసుకు రావడం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
0