సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే వన్ ఆఫ్ ది క్లాసిక్ హిట్ మూవీ మురారి. ఇటీవలే మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయగా.. భారీ రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. మురారి సినిమా రీరిలీజ్ సందర్భంగా ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, టెక్నిషియన్స్ కూడా ఇంటర్య్వూలు ఇచ్చారు. ఇక మురారి సినిమా రీరిలీజ్ కు ముందు నుంచి డైరెక్టర్ కృష్ణవంశీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. మురారి సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని, సందేహాలను నెటిజన్స్ అడుగుతుండగా.. కృష్ణవంశీ నెటిజన్లతో ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలో మురారి షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటన గురించి ఓ నెటిజన్ అడగ్గా.. ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు కృష్ణవంశీ. నిజానికి మురారి సినిమాకు వర్షం డైరెక్టర్ శోభన్, డైరెక్టర్ నందిని రెడ్డి, లక్ష్యం డైరెక్టర్ శ్రీవాస్ అసిస్టెంట్ డైరెక్టర్లుగా వర్క్ చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ.. మురారి షూటింగ్ సమయంలో తమ డైరెక్టర్ డిపార్మెంట్ అంతా ఒకరోజు ధర్నా చేశామని.. షూటింగ్ లో ముఖ్యమైన రోజే అలా చేశామంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇదే విషయాన్ని ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా డైరెక్టర్ కృష్ణవంశీని అడగ్గా.. అసలు విషయం చెప్పారు. నందిని రెడ్డి, టీమ్ మురారి సినిమాలో చేసిన దాని గురించి ప్రశ్నిస్తూ మీకు కోపం వచ్చిందా అని అడగ్గా.. కృష్ణవంశీ రియాక్ట్ అవుతూ.. “కోపం కాదు సర్.. పనిలో రెస్పాన్సబిలిటీగా లేకపోతే నేను తీసుకోలేను. అసిస్టెంట్ డైరెక్టర్స్ ఫ్యూచర్ డైరెక్టర్స్.. వాళ్లు ఏదైనా చేయగలిగేలా, చేసేలా ఉండాలి. వాళ్లు కిడ్స్ లాంటి వాళ్లు అప్పుడు. 12 నుంచి 14 గంటల పనిచేసిన తర్వాత ఫ్రస్టేషన్ వస్తుంది. అది నేను అర్థం చేసుకోగలు. అందుకే నాకు కోపం రాలేదు. ఆ తర్వాత కూడా వాళ్లతో కలిసి పనిచేశాను” అంటూ చెప్పుకొచ్చారు.