సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో నేడు నీట్ యూజీ తుది ఫలితాలను ఎన్టీయే విడుదల చేసినట్టు వార్తలు వచ్చాయి. నీట్ సవరించిన ఫలితాలు (నీట్ రివైజ్డ్ స్కోర్ కార్డ్) పేరిట ఓ లింక్ ఎన్టీయే వెబ్ సైట్ లో కనిపించడంతో… అందరూ ఫలితాలు విడుదలయ్యాయనే అనుకున్నారు. అయితే ఈ లింకు ఓపెన్ కాకపోవడంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది.
దాంతో కేంద్ర విద్యాశాఖ వివరణ ఇచ్చింది. ఎన్టీయే వెబ్ సైట్లో ఉన్నది పాత లింకు అని, ఆ లింక్ చూసి స్కోర్ కార్డ్ లు ప్రకటించినట్టుగా భావించారని పేర్కొంది. సవరించిన స్కోర్ కార్డులు ఇంకా విడుదల చేయలేదని స్పష్టం చేసింది. త్వరలోనే ఫలితాలపై అధికారిక ప్రకటన ఉంటుందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.