పుష్ప–2 ప్రీమియర్ వివాదం అల్లు అర్జును ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే సంధ్యా థియేటర్ తొక్కిసలాట కారణంగా ఒకరోజు జైలులో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు. అయినప్పటికీ ఈ విషయంలో టెన్షన్స్ మాత్రం ఇంకా తగ్గలేదు. రీసెంట్‌గా అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేస్తారని…దీనికి సబంధించి హైకోరట్‌లో పిటిషన్ వేయనున్నారని తెలిసింది. దాంతో పాటూ చిక్కడపల్లి పోలీసులు కూడా తొక్కిసలాట కేసులో సంచలన విషయాలు సేకరించారని..వాటి వలన కూడా అల్లు అర్జున్కు బెయిల్ రద్దయ్యే ఛాన్స్ ఉందని అన్నారు. ఇవి కాక ఇప్పుడు మరో ఉచ్చు బన్నీ మెడకు చుట్టుకోనుంది.
ఎన్‌హెచ్ఆర్సీకు ఫిర్యాదు
తాజాగా అల్లు అర్జున్ మీద హ్యూమ్ రైట్‌కు ఫిర్యాదు వెళ్ళింది. ప్రచారం మోజులో పడి ప్రాణాలు తీశారని ఫిర్యాదు దారు కంప్లైంట్ చేశారని తెలుస్తోంది. ప్రేక్షకులను కంట్రోల్ చేయలేమని పోలీసులు చెప్పినా పట్టించుకోలేదు అని పేర్కొన్న ఫిర్యాదు దారు పుష్ప-2 చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
థియేటర్‌కు షోకాజ్ నోటీసులు..
సంధ్యా థియేటర్ లైసెన్స్ విషయం మీద పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తొక్కిసలాట కారణంగా ఒకరి మృతికి కారణమైన సంధ్య థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అని ప్రశ్నిస్తూ షో కాజ్ నోటీసులు జారీ చేశారు.. ఈ నోటీసుల మీద వారం రోజులలో వివరణ ఇవ్వకపోతే లైసెన్సు రద్దు చేస్తామని కూడా హెచ్చరించారు. అయితే ఈ అంశం మీద సంధ్య థియేటర్ ఇంకా స్పందించలేదు. ఈ థియేటర్ సినిమాటోగ్రాఫ్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదని పోలీసులు నోటీసులో అడిగినట్టు తెలుస్తోంది.