0
మాజీ మంత్రి KTRపై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. రూ.7,380 కోట్ల ORR టోల్ టెండర్లలో అవినీతి జరిగిందని వనపర్తి జిల్లా వాసి యుగంధర్ ఫిర్యాదు చేశారు. క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే వ్యవహారంపై KTRతో పాటు KCRపైనా ఈడీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ A-1గా ఉన్నారు.