manatelanganatv.com

ఎండు మిర్చి ప్యాకెట్‌ పై 500 గ్రాముల స్టిక్కర్‌.. లోపల 100 గ్రాములే.. గోల్నాక డీమార్ట్‌పై కేసు

 గోల్నాక డీ-మార్ట్‌ పై కేసు నమోదైంది. ఓ వినియోగదారుడికి అమ్మిన వస్తువుల తూకంలో మోసం జరిగిందని జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. గోల్నాక అన్నపూర్ణ నగర్‌కు చెందిన సాయి గురువారం డీ-మార్ట్‌లో సుమారు రూ.8500 విలువ చేసే వివిధ రకాల నిత్యావసర సరుకులు కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లిన తర్వాత సర్దుకొనే క్రమంలో ఎండు మిర్చి ( చిల్లీ తేజ) ప్యాకెట్‌ను పరిశీలించగా.. ప్యాకెట్‌ పై 500 గ్రాములు, ధర రూ.299 అని ఉంది. కానీ ప్యాకెట్‌లో మాత్రం 100 గ్రాముల ఎండు మిర్చి మాత్రమే ఉన్నాయి.సాయి వెంటనే డీ-మార్ట్‌కు వచ్చి విషయాన్ని అక్కడి ఇన్‌చార్జికి తెలిపాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని నిర్లక్ష్యంగా మాట్లాడాడు. దీంతో సాయి స్థానికంగా ఉన్న నాయకులను అక్కడకు పిలిచి జరిగిన విషయం చెప్పాడు. స్థానిక నాయకులు జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్సై శ్రీరామ్‌ సంజీవరావు, శివ తమ సిబ్బందితో వచ్చి తక్కువ తూకం గల ఎండు మిర్చి ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మిగతా వస్తువుల బరువులను అధికారులు తనిఖీ చేశారు.

కొన్ని బాదం ప్యాకెట్లలో బాదం పుచ్చు పట్టినట్లు గమనించారు. వినియోగదారులను మోసం చేయడంతో పాటు ప్యాకెట్‌ పై అధిక బరువు ముద్రించి లోపల తక్కువ ఐటం పెట్టి ఎక్కువ ధర తీసుకున్నందుకు 36(2) సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. అలాగే పంచనామా చేసి సంబంధిత తక్కువ బరువు గల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278