ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ నుండి కూకట్పల్లి వరకు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు మెట్రోలో ప్రయాణికులు కలిసి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని హైదరాబాదులో ఐటీరంగం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించుకుంటూ మెట్రోలో ప్రయాణించారు.
అనంతరం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం
నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన పది సంవత్సరాలలో ఒకవైపు సంక్షేమంలో మరోవైపు అభివృద్ధిలో దేశంలోనే అగ్రమిగా నిలిపిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంకు వచ్చిన నాలుగు నెలల్లో 6 గ్యారంటీల పేరుతో గారడి చేయడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ఇప్పటికే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం తేలిపోయిందని అన్నారు.హైదరాబాద్ మహానగరంలో మంచినీటి సమస్య కరెంటు సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని కెసిఆర్ పాలించిన తొమ్మిది సంవత్సరాలలో ఏనాడైనా కరెంటు సమస్య మంచినీటి సమస్య ప్రజలకు కనపడిందని కాంగ్రెస్ పార్టీ నాయకులను మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు.
అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కొడంగల్ లో ఓడిపోయిన రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి ప్రజలు ప్రశ్నించే గొంతు ఏదో అభివృద్ధి చేస్తారు ఏదో మార్పు తీసుకొస్తారు అని గెలిపించారని కానీ గెలిచిన ఐదు సంవత్సరాలలో ఒక్కరోజైనా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని ప్రజల సమస్యలను తెలుసుకోలేని అజ్ఞానాన్ని అదే అలాంటి నాయకులే మళ్లీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో పోటీలో నిలబడ్డారని కరీంనగర్ నుంచి వచ్చిన ఈటెల రాజేందర్, చేవెళ్ల నుండి వచ్చిన సునీత మహేందర్ రెడ్డి ఇద్దరూ నాన్ లోకల్ ప్రజలు అలాంటి వాళ్ళు కాకుండా గత 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలు బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ప్రజలను విన్నవించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు, కెపి వివేకానంద, లక్ష్మారెడ్డి,మర్రి రాజశేఖర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంభుపురి రాజు , దయానంద్, కంటోన్మెంట్ అభ్యర్థి నివేదిత ,కార్పొరేటర్లు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు