మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా సోమవారం రాత్రి(ఆగస్టు 12న) కర్నూల్‌లో ప్రీరిలీజ్ ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పసురు రంగు చీరలో ఎంతో సంప్రదాయ బద్ధంగా కనిపించింది. ఇక స్టేజీ పై కొరియోగ్రాఫర్ భానుతో కలిసి ఆమె డ్యాన్స్ చేసింది. అంతేనా యాంకర్ సుమతోనూ ఆమె డ్యాన్స్ చేయించింది. నల్లంచు తెల్లచీర పాటలోని హుక్ స్టెప్‌ను ఆమె వేసింది. దీంతో ఆ ప్రాంగణం మొత్తం అరుపులతో దద్దరిల్లిపోయింది.ఈ చిత్రానికి మిక్కీజేయర్ మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. జగపతిబాబు కీలక పాత్రలో నటించారు.
0