ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి ముందుగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం బన్నీని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ను తీసుకెళ్లారు. బన్నీ వెంటే అల్లు అరవింద్, అల్లు శిరీష్ సైతం పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.
కోర్టు వెళ్లిన అల్లు అరవింద్, త్రివిక్రమ్
అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా ఇప్పటికే కోర్టుకు అల్లు అరవింద్, త్రివిక్రమ్ చేరుకున్నారని తెలుస్తుంది.