బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసినట్లుగానే అసెంబ్లీ బయట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. కొందరు పొద్దున్నే డ్రింక్ చేసి.. సభకు వస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టార్గెట్ గా ఆరోపణలు చేశారు.
Mana Telangana TV
ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అశ్విన్ ఈ విషయాన్ని ప్రకటించాడు. ఈ ప్రకటన చేసేముందు అశ్విన్ డ్రెస్సింగ్ గదిలో విరాట్ కోహ్లీతో భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇంతలోనే ఆశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
భారత్ తరపున ఆడినందుకు..
భారత్ తరపున ఆడినందుకు ఎంతో గర్విస్తున్నానని అశ్విన్ వీడ్కోలు సమయంలో అన్నాడు. కెరీర్లో 106 టెస్టులు, 537 వికెట్లు, 3503 పరుగులు సాధించానని, భారత్ క్రికెట్లో తన భాగస్వామ్యం కూడా ఉండటం ఆనందంగా ఉందని అశ్విన్ తెలిపాడు. గురువారం అనగా రేపు అశ్విన్ ఇండియాకి రానున్నారు.
హరీశ్‌రావు పట్ల పోలీసులు అత్యుత్సాహం.. శాసనసభ ప్రవేశ మార్గంలో పేపర్లు లాక్కున్న డీఎస్పీ
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పట్ల పోలీసులు అత్యుత్సాహం చూపించారు. శాసనసభ ప్రవేశ మార్గం వద్ద హరీశ్‌రావును ఆపిన డీఎస్పీ సుదర్శన్.. ఆయన తీసుకెళ్తున్న పేపర్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. కారు తనిఖీ పేరుతో హరీశ్‌రావు తీసుకెళ్తున్న పేపర్లను లాక్కున్నారు. డీఎస్పీ సుదర్శన్‌తో పాటు ఇతర పోలీసు సిబ్బంది తీరుపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం దుర్మార్గమంటూ పోలీసులపై మండిపడ్డారు. ఈ ఘటనపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇంతలా ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదని అన్నారు. ప్రజా పాలనలో కంచెలు తొలగించామని అంటూనే.. పోలీసులతో అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు. శాసనసభ ప్రవేశమార్గంలో తనతో పోలీసులు వ్యవహరించిన తీరుపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వద్ద ఉన్న ప్లకార్లులను మండలిలోకి అనుమతించలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వద్ద ప్లకార్డులను పోలీసులు, మార్షల్స్ లాక్కుని.. వారిని లోపలికి పంపించారు.
కాగా, ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని ఇవాళ బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ క్రమంలోనే కేటీఆర్, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి సహా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖాకీ దుస్తులు ధరించి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు.
ఫార్ములా-ఈ కేసు విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మరో రెండు రోజుల్లో ఏసీబీ నోటీసులు పంపనున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్‌తో పాటు మరికొందరిపై కూడా ఏసీబీ కేసు నమోదు చేయనుంది. అయితే విచారణ సమయంలో న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నటారట. ఇదే కనుక జరిగితే ఇంకో రెండు రోజుల్లో కేటీఆర్‌కు నోటీసులు వెళ్లడం పక్కా అని తెలుస్తోంది.
ఇటీవల సీఎస్ శాంతకుమారి కూడా ఈ కేసును టేకప్ చేయాలని ఎసీబీకి లేఖ రాశారు. దీనికి గవర్నర్ ఇచ్చిన అనుమతిని జోడించి.. రేస్ నిర్వహణలో నిధుల దుర్వినియోగం ఎలా జరిగింది? ఎవరు చేశారనే విషయాలపై దర్యాప్తు చేయాలని శాంతకుమారి ఏసీబీని కోరారు. ఆర్బీ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ చెల్లించడం, ముందు డబ్బులు ఇవ్వడం ఆ తర్వాత ఒప్పందం చేసుకోవడం నేరమని ఆమె లేఖలో తెలిపారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన పార్ములా-ఈ కార్ విషయంలో నిధులు దుర్వినియోగం చేశారని కేటీఆర్‌పై ఆరోపణలు వచ్చాయి. హెచ్ఎండీఏ అనుమతి లేకుండా ఈ కారు సంస్థకు రూ. 46 కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించారు. దీంతో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, చీఫ్ ఇంజినీరుతో పాటు గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతివ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. అయితే కేటీఆర్ చేయమన్నారని ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ చెప్పడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో విపరీతంగా గాయపడిన శ్రీతేజ్ చావు బుతుకుల మధ్య పోరాడుతున్నాడు. దాదాపు పదిరోజులుగ ఈపిల్లాడు ఆసపత్రిలనే ఉన్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కొంత సేపటి క్రితం కిమ్స్ వైద్యులు శ్రీతేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నామని చెప్పారు. అతని జ్వరం పెరుగుతోందని కానీ మినిమం ఐనోట్రోప్స్‌లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయని తెలిపారు. ఫీడ్లను బాగానే తట్టుకుంటున్నాడు కానీ దీని బట్టి అతను పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాని మాత్రం చెప్పలేమని అంటున్నారు. ఎప్పుడు ఏమవుతోందో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. స్టాటిక్ న్యూరోలాజికల్ స్థితి దృష్ట్యా, వెంటిలేటర్ నుండి బయటకు తీసుకురావడానికి ట్రాకియోస్టోమీని ప్లాన్ చేస్తున్నారని కిమ్స్ వైద్యులు తెలిపారు. శ్రీతేజ్‌కు మెదడుకి ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదని కిమ్స వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామని చెప్పారు. ఇలా ఎంత కాలం ఉండాల్సి వస్తుందో ఇప్పుడే చెప్పలేమని అన్నారు.
రేవంత్‌రెడ్డి మాటకారే కానీ పనిమంతుడు కాదని, తెలంగాణ గురించి తెలిసిన ఏకైక నేత కేసీఆర్ ఒక్కరేనని తెలంగాణ ప్రజలు కుండబద్దలు కొట్టారు. జోగులాంబ దేవాలయం అలంపూర్ నియోజకవర్గం నుంచి మొదలుకొని భద్రాద్రి రామయ్య భద్రాచలం నియోజకవర్గం వరకు ప్రజలు ఒకే తీరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలోనే సుఖ సంతోషాలతో ఉన్నామని, రేవంత్‌రెడ్డి పాలన తమకొద్దని ముక్తకంఠంతో చెప్తున్నారు. రేవంత్ పాలనతో సరిపోల్చినప్పుడు కేసీఆర్ పాలన 100 శాతం అద్భుతమని ప్రజలు తమ మనోగతాన్ని బయటపెట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో హెచ్ఎంటీవీ, వోటా, కేకే, చాణక్య స్టాటిస్టిక్స్ తదితర సర్వే సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు చేశాయి. ప్రజానాడిని పట్టుకునే ప్రయత్నం చేశాయి. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినవి, చెప్పనివి కూడా చేశారని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీల మీద 82 శాతం మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సర్వేల్లో తేలింది. రానున్న సంస్థాగత ఎన్నికల్లో కేసీఆర్ బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేస్తామని మెజారిటీ ఓటర్లు చెప్పుకొచ్చారు.
వోటా సర్వేలో కేసీఆర్ టాప్
ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించినదేమిటి? చేయలేకపోయినదేమిటి? ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉన్నది? వంటి పలు అంశాలపై వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రా (వోటా) సంస్థ 2024 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేసింది. సింపుల్ రాండమ్ విధానంలో చేసిన ఈ సర్వే కోసం 1677 శాంపిల్స్ సేకరించినట్టు వోటా సీఈవో కంబాలపల్లి కృష్ట మీడియాకు తెలిపారు. వీరిలో 57% మంది పురుషులు, 43% శాతం మహిళలు ఉన్నారు. పని ఆధారంగా నిరుద్యోగులు, రైతులు, కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, గృహిణులు, కార్మికులు, పెన్షనర్లు, చిరు వ్యాపారుల అభిప్రాయం సైతం సర్వే సంస్థ సేకరించినట్టు చెప్పారు. 18 ఏళ్ల నుంచి 65 ఏండ్లు, ఆ పైన వారి వరకు సర్వేలో పాల్గొన్నారు.
ఇద్దరు సీఎంల పరిపాలనలో ఎవరి పాలన బాగుందన్న ప్రశ్నకు కేసీఆర్ పాలన బాగుందని 44 శాతం మంది ప్రజలు తేల్చి చెప్పారు. రేవంత్‌రెడ్డి పాలన బాగుందని 30% మంది చెప్పినట్టు సర్వే నివేదించింది. సీఎంగా రేవంత్‌రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారన్న ప్రశ్నకు ఒక్కరంటే ఒక్కరు కూడా వందకు వంద మార్కులు వేస్తామని చెప్పలేదని, 59 శాతం మంది ఆయనకు 25 మార్కులు వేసి ఫెయిల్ చేసినట్టు వోటా సర్వే పేర్కొన్నది. 200 యూనిట్లలోపు వారందరికీ జీరో కరెంటు బిల్లు అమలు అవుతున్నదా? అన్న ప్రశ్నకు 50 శాతం మంది కొందరికే అమలు అవుతున్నని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి? అన్న ప్రశ్నకు బీఆర్ఎస్కు ఓటేస్తామని 39% మంది చెప్పగా, కాంగ్రెస్‌కే అని 30% మంది, ఎన్డీఏ కూటమికి వేస్తామని 19 శాతం మంది, ఇతరులకు వేస్తామని 7% మంది చెప్పినట్టు సర్వే ఫలితాల్లో వెల్లడించారు.
పసిఫిక్ ద్వీప దేశం వనౌటు ను భారీ భూకంపం కుదిపేసింది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న వనౌటు తీరంలో మంగళవారం ఉదయం అత్యంత శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 7.3గా నమోదైంది. దేశంలోనే అతిపెద్ద నగరమైన రాజధాని పోర్ట్ విలా కు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
7.3 తీవ్రత తర్వాత ఇదే ప్రాంతంలో పలు మార్లు 5.3 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం ధాటికి ఎత్తైన భవనాలు ఊగిపోయాయి. అనేక భవనాలు, కార్లు దెబ్బతిన్నాయి. పోర్ట్ విలాలోని యూఎస్, యూకే, ఫ్రాన్స్ సహా పలు దేశాల రాయబార కార్యాలయాలు ఉన్న భవనం ధ్వంసమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ భూకంపం ఘటనలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నిన్న పాలస్తీనా.. నేడు బంగ్లాదేశ్ బ్యాగ్.. వినూత్న రీతిలో ప్రియాంక గాంధీ నిరసన
పార్లమెంట్‌కు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) పలు అంశాలపై వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. నిన్న ‘పాలస్తీనా’ (Palestine) బ్యాగ్‌తో పార్లమెంట్‌కు హాజరైన ప్రియాంక.. ఇవాళ ‘బంగ్లాదేశ్’ (Bangladesh) బ్యాగ్‌తో దర్శనమిచ్చారు.
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ‘బంగ్లాదేశ్ మైనారిటీల పక్షాన నిలవండి’ (Stand with minorities of Bangladesh) అంటూ రాసి ఉన్న బ్యాగ్‌తో పార్లమెంట్‌కు వచ్చారు. విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు సైతం ఇదే బ్యాగ్‌తో పార్లమెంట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు.
ప్రియాంక గాంధీ నిన్న పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్‌తో పార్లమెంట్‌కు హాజరయ్యారు. పాలస్తీనా సంఘీభావానికి చిహ్నంగా భావించే పుచ్చకాయ, శాంతి చిహ్నాలు వంటివి ఆ బ్యాగ్‌పై ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాలస్తీనాలోని గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ గళమెత్తారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజాలో ‘జాతి హత్య’లకు పాల్పడుతున్నదని ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీరును కూడా ఆమె నిందించారు. గత వారం ఢిల్లీలోని పాలస్తీనా రాయబార కార్యాలయం ఛార్జ్ డి అఫైర్స్ అబేద్ ఎల్రాజెగ్ అబు జాజర్ను కూడా ఆమె కలిశారు.
ఒకే దేశం-ఒకే ఎన్నిక (One Nation One Election Bill) లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించేందుకు రూపొందించిన బిల్లు ఇవాళ లోక్‌సభ (Lok Sabha) ముందుకు వెళ్లింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్రం మంగళవారం సభలో ప్రశేపెట్టింది. ఈ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) సభలో ప్రవేశపెట్టారు. విస్తృత సంప్రదింపులు జరిపేందుకు గానూ పార్లమెంటు ఉభయసభల ఉమ్మడి కమిటీకి ఈ బిల్లును సిఫారసు చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మేఘ్వాల్ కోరారు.
ఎంపీల సంఖ్య ఆధారంగా ఆయా పార్టీలకు ఈ కమిటీలో చోటు కల్పించనున్నారు. ఏ పార్టీ తరఫున ఎంతమంది సభ్యులు ఉంటారో స్పీకర్ సాయంత్రానికి ప్రకటించనున్నారు. అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ నుంచి కమిటీ చైర్మన్ ఉండనున్నారు. కమిటీలో ఉండేందుకు ఎంపీల పేర్లను ఇవాళే ప్రతిపాదించాలని రాజకీయ పార్టీలను స్పీకర్ కోరనున్నారు. ప్రాథమికంగా ఈ కమిటీ కాలపరిమితి 90 రోజులు విధించనున్నారు. తర్వాత ఈ గడువును పొడిగించే అవకాశం ఉంది. కాగా, జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు 32 రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వగా, 15 పార్టీలు వ్యతిరేకించినట్టు ఇప్పటికే రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు, లోక్‌సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం. వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు, రాష్ర్టాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ర్టాల శాసనసభలను బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది.