హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ షార్ట్ ఫిల్మ్ డైరెకర్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధిత యువతి పుప్పాలగూడలోని ఓ కంపెనీలో పనిచేస్తోంది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిద్ధార్థ వర్మ మరో యువతి ద్వారా బాధితురాలిని పరిచయం చేసుకున్నాడు. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఆమెను నమ్మించాడు. బుధవారం ఆమెను తన ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానించాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగించి చివరకు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిద్ధార్థ వర్మను అరెస్టు చేశారు.
0