manatelanganatv.com

Breaking :రేవంత్ కి త్వరలోనే 70MMలో సినిమా చూపిస్తాం..!

రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నేత, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ చేపట్టిన పాదయాత్ర కేవలం ట్రైలర్ మాత్రమేనని.. ప్రభుత్వానికి త్వరలో 70 ఎంఎంలో సినిమా చూపించబోతున్నామని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతు సమస్యలపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మంగళవారం చేపట్టిన పాదయాత్రలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‎లో మాట్లాడిన హరీష్ రావు.. రైతుల కష్టాలు చూడలేక ఎమ్మెల్యే సంజయ్ కోరుట్ల నుంచి జగిత్యాల వరకు పాదయాత్ర చేపట్టారని చెప్పారు.

నాడు డాక్టర్‎గా.. నేడు ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ మంచి పేరు తెచ్చుకుంటున్నారని హరీష్ రావు అన్నారు. కేసీఆర్‎కు దేశంలోనే రైతు సీఎం అనే పేరు వస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బూతుల సీఎం అనే పేరు వచ్చిందంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. రేవంత్ బూతులు మాట్లాడటం తప్ప ఒక్కటైనా పనికొచ్చే పనైనా చేశారా.. అంటూ విమర్శించారు. జగిత్యాల అంటేనే  జైత్రయాత్ర గుర్తుకు వస్తుందని.. అదే జగిత్యాలలో మా ఎమ్మెల్యే పూరించిన సమర శంఖంతోనైనా  రేవంత్ కళ్లు తెరిస్తే చాలని హరీష్ అన్నారు.

harish rao fire on revanth reddy
harish rao fire on revanth reddy

రైతులు వడ్ల లోడు ఎత్తమని అడుగుతుంటే.. రేవంత్ మాత్రం మహారాష్ట్రకు డబ్బు మూటల లోడ్ ఎత్తుతున్నాడని హరీష్ రావు సెటైర్ వేశారు. మూసీ దగ్గర కాదు.. కూల్చేసిన ఇండ్ల దగ్గర సీఎం రేవంత్  పాదయాత్ర చేయాలని హరీశ్‌ డిమాండ్ చేశారు. దమ్ముంటే ఇళ్లు కూలిన చోట పాదయాత్ర చేయాలని.. అక్కడికి తాము కూడా వస్తామని హరిశ్‌ రావు సవాల్ చేశారు. మూసీ కంపు కంటే సీఎం రేవంత్ నోటి కంపే ఎక్కువగా ఉందని విమర్శలు కురిపించారు.

సీఎం రేవంత్ చేసిన పాపం ప్రజలకు తగలకుండా చూడమని వేములవాడకు పోయి మొక్కి వచ్చినా.. ఇక్కడి నుంచి ధర్మపురి, కొండగట్టు, కోటిలింగాల దేవుళ్లకు మొక్కుతున్నానని హరీష్ రావు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం తప్ప.. మిగిలిన అన్నీ గ్యారెంటీలు తుస్సేనంటూ హరీష్ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‎కు మాటలెక్కువ, చేతలు తక్కువని తీవ్ర విమర్శలు చేశారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278