manatelanganatv.com

ఇకపై స్థానిక ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్న అర్హులే

స్థానిక ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీకి అనర్హులనే నిబంధనను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. దీనికి సంబంధించిన చట్ట సవరణ బిల్లులను బుధవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇకపై ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే కొత్త నిబంధనను తీసుకొస్తోంది. 

కుటుంబ నియంత్రణలో భాగంగా..

కుటుంబ నియంత్రణలో భాగంగా ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులనే చట్టాన్ని 1994లో  తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతం సంతానోత్పత్తి రేటు తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మున్సిపల్, పంచాయితీ రాజ్ చట్టానికి కూడా ఈ సవరణలకు ఏకగ్రీవంగా శాసన సభ ఆమోద ముద్ర వేసింది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పటి నుంచి ఈ చట్టం ఉంది. అయితే 30 ఏళ్ల నుంచి ఈ చట్టంపై ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉండే మహిళలపై ఎక్కువగా వివక్ష చూపించారని కూడా విమర్శలు వచ్చాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో చాలా వరకు జనాభా తగ్గిపోయిందట. ముఖ్యంగా ఏపీలో సంతానోత్పత్తి సామర్థ్యం రేటు తగ్గింది. 2001లో 2.6శాతం ఉండగా.. 2024 నాటికి అది 1.5శాతం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.

రాష్ట్రంలో జనాభా రేటు తగ్గిపోవడాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం నుంచి వచ్చే పన్ను ఆదాయంలో కూడా కోతలు ఉన్నాయని, ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హులుగా ఉండటం వల్ల వివక్ష చూపించినట్లు ఉందనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278