ఆంధ్రప్రదేశ్‌లో బిగ్ డేకు సిద్ధం. లోక్‌సభ ఎన్నికలతోపాటు శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌కు సర్వం సంసిద్ధం చేశారు ఎన్నికల సంఘం అధికారులు. మరి కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ బూత్‌లకు ఈవీఎంల తరలింపు పూర్తయింది. ఇక రేపు ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభం అవుతుంది. దాన్ని ఆరున్నరకల్లా ముగించి, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ చేపడతారు. ఇక ఏపీలో తొలిసారి భారీగా వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు.ఎన్నికలు సజావుగా సాగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌కి సర్వం సిద్ధమైంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1,06,145 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 34 వేలకుపైగా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 14 నియోజకవర్గాలను సున్నితమైనవిగా గుర్తించారు. కేంద్ర పరిశీలకుల సూచనల మేరకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా చెప్పారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో పోలింగ్‌కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విశాఖ రేంజ్‌లోని ఐదు జిల్లాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి.. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకున్నామని విశాల్ గున్ని తెలిపారు. ఏపీలో మొత్తంగా 1.06 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.