manatelanganatv.com

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నలుగురు అధికారులకు మళ్లీ నిరాశే

రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో తిరిగి నలుగురు అధికారులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో నిందితులైన డీఎస్పీ ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, నగర టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీజీపీ రాధాకిషన్‌రావులకు న్యాయమూర్తి బెయిలివ్వటానికి నిరాకరిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో అరెస్టయ్యాక ఈ నలుగురు నిందితులు బెయిల్‌ కోసం ప్రయత్నించటం ఇది నాలుగోసారి. కాగా, వీరికి బెయిల్‌ లభిస్తే, వెలుపలికి వచ్చి కీలకమైన ఆధారాలను తారుమారు చేయడంతో పాటు సాక్షులను బెదిరించే అవకాశమున్నదని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు వాదించారు. అంతేగాక, త్వరలోనే ఈ కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చే అవకాశమున్నదనీ, ఈ సమయంలో వీరికి బెయిలివ్వరాదంటూ వాదనలు వినిపించారు. తమ క్లయింట్లకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ నిందిత అధికారుల తరఫు న్యాయవాదులు వాదించారు. వీరి వాదనలను విన్న న్యాయమూర్తి.. నలుగురు నిందితులకు బెయిల్‌ను నిరాకరించారు. ఇటీవలే, ఈ నిందితులకు సంబంధించి నాలుగోసారి చార్జీషీట్‌ను దర్యాప్తు అధికారులు కోర్టులో దాఖలు చేయగా.. అందులో కొన్ని లోపాలున్నాయంటూ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. దీంతో ఆ లోపాలను సరిదిద్దుతూ తిరిగి చార్జిషీట్‌ను దర్యాప్తు అధికారులు దాఖలు చేసినట్టు సమాచారం.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278