అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్నారు. సంద్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు పోలీసులు. పుష్ప 2 విడుదల సందర్భంగా సంద్యథియేటర్ కు సినిమా చేసేందు వెళ్లారు అల్లు అర్జున్. ఆ సమయంలో ఆయనను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున అక్కడికి వచ్చారు. దాంతో తొక్కిసలాట జరిగింది.
అల్లు అర్జున్ పోలీసులు ముందు హాజరయ్యారు. నిన్న అల్లు అర్జున్ కు నోటీసులు పంపారు పోలీసులు. సంద్యథియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేసిన చేశారు. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ సందడి చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. దాంతో అల్లు అర్జున్ బౌన్సర్లు జనాలను వెనక్కి నెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. అలాగే ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ను ఏ 11గా చేర్చారు.
తాజాగా అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాంతో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో పోలీసులు సంధ్య థియేటర్ లో జరిగిన సంఘటన గురించి అల్లు అర్జున్ ను ప్రశ్నించనున్నారు. అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా స్టేషన్ కు వచ్చారు. అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నారు పోలీసులు.