manatelanganatv.com

గుర్తింపు లేని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

గుర్తింపు లేని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డీఈవో విజయ కుమారి ,ఎంఈఓ లు వసంత కుమారి,శశిధర్ నీ కలెక్టరేట్ లో ఉన్న డిఈఓ ఆఫీసులో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది…
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్ డిమాండ్…

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ…. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అనేకసార్లు వినతిపత్రం రూపంలో కలిసి ఇచ్చిన చర్యలు మాత్రం లేవని అధికారులకు తెలియజేశారు. విద్య అధికారులకు గుర్తింపు లేని విద్యాసంస్థల పేర్లు చెప్పిన పట్టించుకునే దుస్థితి లేదని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలల లో అనేకం గుర్తింపు లేని పాఠశాలలు విద్యా సంస్థలు ఉన్నాయని తెలియజేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్య అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే కార్పొరేట్ ప్రైవేటు యజమాలులు విచ్చలవిడిగా గుర్తింపు లేకుండా విద్యాసంస్థలు పెట్టి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్న విద్య అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. పదేపదే విద్య అధికారులకు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో బుక్స్ యూనిఫామ్,బెల్టు అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన చర్యలు మాత్రం లేవు అని డిమాండ్ చేశారు. ఈరోజు కలిసినప్పుడు విద్య అధికారులు డీఈవో, ఎంఈఓ లు గుర్తింపు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఇప్పటికైనా ప్రైవేట్ కార్పొరేటు గుర్తింపు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నామన్నారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278