రెండు ఆటోలలో 4000 కిలోల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లాకు చెందిన పాండునాయక్ శనివారం రెండు ఆటోలలో 4 వేల కిలోల బియ్యంలోడును నింపుకొని తీసుకు వెళ్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించి రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో పాండునాయక్ అనే వ్యక్తిపై 13 కేసులు ఉన్నట్లు తెలిపారు
0