శామీర్ పేట: మహిళా వేధింపు కేసులో జూనియర్ అసిస్టెంట్ అజయ్ పై శామీర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న అజయ్ అనే వ్యక్తి అదే కార్యాలయంలో మరొక విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళా జూనియర్ అసిస్టెంట్ తో గత కొంత కాలంగా ప్రేమించమని వెంటపడుతూ వేధిస్తున్నాడు. వేధింపులు తాళలేక ఆ మహిళ ఈనెల 25 శామీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శామీర్ పేట పోలీసులు జూనియర్ అసిస్టెంట్ అజయ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0