మెగాస్టార్ చిరంజీవి గారాట పట్టి శ్రీజ ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. ఆమె చేసిన ఓ ఇన్ స్టా వీడియో పోస్ట్.. తెగ చక్కర్లు కొడుతుంది. ఆమె రెండవ భర్త కల్యాణ్ దేవ్‌తో కూడా డివోర్స్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లే వారి సోషల్ మీడియా మూవ్స్ ఉన్నాయి. శ్రీజ అయితే కళ్యాణ్ ఫోటోలు అన్నింటిని డిలీట్ చేసింది. ఇదంతా ఓల్డ్ టాపిక్. తాజాగా శ్రీజ… డియర్ 2022, నా జీవితంలోని చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరో తెలిసేలా చేశావ్ అంటూ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. నా గురించి అన్నీ తెలిసిన వ్యక్తి.. నన్ను ఎంతగానో ఇష్టమపడే వ్యక్తి.. నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకునే వ్యక్తి.. నాకు మద్దతుగా ఉండే వ్యక్తి.. నా కష్టసుఖాల్లో తోడు నిలిచే వ్యక్తి.. డియర్ మీ.. ఫైనల్‌గా నిన్ను కలవడం హ్యాపీగా ఉంది.. కొత్త ప్రయాణం షురూ అని ఆమె ఓ వీడియోను పంచుకున్నారు. మొత్తంగా ఈ పోస్ట్‌ను గమనిస్తే..తనలో దాగున్న అసలైన వ్యక్తిని కలిశానని, తనను తన కంటే ఎవ్వరూ బాగా అర్థం చేసుకోలేరని ఆమె చెప్పుకొచ్చింది.
4