manatelanganatv.com

మంగంపేట అవుట్సోర్సింగ్, ట్రైనీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం…

ఏపియండిసి మంగంపేట నందు పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ & ట్రైనీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఫిబ్రవరి నాల్గోతేదీ నుండి 12(3) అగ్రిమెంట్ ప్రకారం ప్రతి ఒక్క కార్మికుడు కు న్యాయం చేయాలని భోజన విరామ సమయంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ,  వినూతన పద్ధతిలో నల్ల బ్యాడ్జ్ లు , ప్లే కార్డ్స్,తో , పోరాట కమిటీ ఆధ్వర్యంలో  నిరసన తెలుపుతున్న కార్మికులు, జేఏసీ, అడ్వైజర్, సిహెచ్ చంద్రశేఖర్, ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగిస్తూ, ఏపీఎండిసి యాజమాన్యం, మొండి వైఖరి వెడనాడి, గతంలో కార్మిక సంఘాలతో, చేసుకున్న ఒప్పందం ప్రకారం, సమాన పనికి, సమాన వేతనం, అమలు చేయాలని, డిమాండ్ చేశారు. కార్మికుల్లో గొంతెమ్మ కోరికలు కోరలేదని, చట్టబద్ధమైనటువంటి, న్యాయమైన కోరికలు మాత్రమే అడుగుతున్నారని, మేనేజ్మెంటు ఒప్పుకున్న వాటిని చట్టబకారం అందరికీ  డెసిగ్నేషన్తో  కూడిన వేతనం అమలు చేయాలన్నారు. కార్మికుల యొక్క సహనాన్ని, పరీక్షించొద్దని, తక్షణమే, జేఏసీ నాయకులతో, చర్చలు జరిపి, సమస్యల పరిష్కరించాలన్నారు. అందరికీ న్యాయం జరిగే వరకూ, జేఏసీ పోరాటానికి, సిఐటియు, సంపూర్ణ  మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎండీసీ పోరాట కమిటీ కన్వీనర్ ఆర్. వెంకటేష్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చేస్తున్న నిరసన ఈనాటికి ఏడు రోజులకు చేరుకొన్నాయి, యాజమాన్యం వారు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికులు అంతా ఎకమై ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు, ఈ ఉద్యమం రోజు రోజు కూ తీవ్ర రూపం దాలుస్తుంది అని ఇప్పటికైనా యాజమాన్యం వారు గ్రహించి సమాన పనికి సమాన వేతనం నందు జరిగిన అన్యాయాన్ని గ్రహించి లేబర్ కమిషనర్ గారి వద్ద చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం సక్రమంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఈరోజు వినూత్నంగా కార్మికులు భోజన విరామ సమయంలో ఫ్లకార్డ్స్ పట్టుకుని, నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన కార్యక్రమం లో పాల్గొన్నారు అని యాజమాన్యం వారు పోరాట కమిటీ నాయకులను చర్చలకు ఆహ్వానించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు లేని పక్షంలో  ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని అన్నారుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీఎంసీ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ బండారు భాస్కర్, ఎంప్లాయీస్ & వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ నారదాసు సుబ్బరాయుడు, కో కన్వీనర్ లు ఏ.అరుణావతి, ట్రెజరర్ పి. ఈశ్వరయ్య, యం. చంద్రశేఖర్, పి. దేవ కుమార్ రెడ్డి, జియస్. మణి, పి. వేణుగోపాల్ రెడ్డి, జి.లక్ష్మీ కాంత్, కె. ప్రతాప్, యస్.పెంచలయ్య, జి. దానమయ్య, సి. ధనలక్ష్మీ, పి. రమణయ్య.

470 వ రోజు భరతమాత అన్నప్రసాద వితరణ పధకంలో దాత, దాతృత్వంతో నిరుపేదలకు, వృద్ధులకు మరియు యాచకులకు భోజన ప్యాకెట్లను దాత యొక్క దంపతుల చేతులమీదుగా పంపిణి చేయటం అభినందనీయం,క్రమశిక్షణతో ,సమయపాలన మరియు చిత్తశుద్ధితో సేవ చేస్తున్న భరతమాత టీం ను హృదయ పూర్వకముగా అభినందిస్తున్నాము…. గుండవరపు అమర్ నాద్ ,ప్రధాన కార్యదర్శి, చైతన్య కళా స్రవంతి, పల్నాడు జిల్లా ,సత్తెనపల్లి పట్టణం….. ఈ రోజు అనగా ది 29.11.22 తేదీ,మంగళవారం ఉదయం, సత్తెనపల్లి పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో, తాడువాయి రాములు భవన్ వద్ద భరతమాత పధకంలో సత్తెనపల్లి పట్టణానికి చెందిన కీర్తిశేషులు గంతా వీరభద్రయ్య గారి పుణ్య తిథి సందర్భంగా వీరి కుమారుడు చైతన్య కళా స్రవంతి సహాయ కార్యదర్శి బొంతా శ్రీనివాసరావు వీరి ధర్మపత్నీ శ్యామల వీరి కుమారుడు అనిల్ గార్ల ఆర్దిక సహాయంతో 40 మందికి భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో చైతన్య కళా స్రవంతి మరో సహాయ కార్యదర్శి కల్లూరి నాగ బ్రహ్మచారి మరియు నండూరి లక్ష్మీనారాయణ మరియు కట్టా శంకరరావు, గడ్డం శివ శంకరరావు, మురారిశెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈనాటి దాతకు మరియు వారి కుటుంబ సభ్యులకు సత్తెనపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షుడు దివ్వెల శ్రీనివాసరావు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278