manatelanganatv.com

స్విగ్గీలో.. చికెన్‌ బిర్యానీ ఆర్డరే టాప్‌… నివేదిక విడుదల చేసిన స్విగ్గీ

ఎప్పటిలాగానే చికెన్‌ బిర్యానీ సత్తా చాటుకుంది. అత్యంత ఇష్టమైన ఫుడ్‌గా బిర్యానీ నిలిచింది. ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆధారిత సంస్థ స్విగ్గీ ‘హౌ ఇండియా స్విగ్గుడ్‌’ అనే శీర్శికన రిపోర్టు విడుదల చేసింది. ఈ ఏడాది 8.3 కోట్ల ఆర్డర్లతో వరుసగా తొమ్మిదోసారి దేశంలో అత్యంత ఆదరణ పొందిన వంటకంగా బిర్యానీ నిలిచింది. ప్రధానంగా చికెన్‌ బిర్యానీకి 4.9 కోట్ల ఆర్డర్లు రావడం విశేషం. స్విగ్గీ రిపోర్ట్‌ ప్రకారం, బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్‌ టాప్‌లో నిలిచింది.

2024లో 9.7 మిలియన్ల బిర్యానీ ఆర్డర్‌లతో బిర్యానీ లీడర్‌ బోర్డులో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం, బెంగళూరు 7.7 మిలియన్ల ఆర్డర్లు, చెన్నై 4.6 మిలియన్ల ఆర్డర్లతో ఉన్నాయి. రంజాన్‌ సందర్భంగా స్విగ్గీలో 6 మిలియన్‌ ప్లేట్ల బిర్యానీలు ఆర్డర్‌ చేసినట్టు పేర్కొంది. ఇందులో కూడా హైదరాబద్‌ టాప్‌లో ఉందని వివరించింది. ఒక్క నగరం నుంచే 10 లక్షల కంటే అధికంగా బిర్యానీ ఆర్డర్లు చేసినట్టు పేర్కొంది. చికెన్‌, మటన్‌, పన్నీరు, ఎగ్‌ తదితర విభిన్న రకాల 15.7 మిలియన్ల బిర్యానీలు హైదరాబాద్‌ నుంచి ఆర్డర్‌ ఉన్నట్టు పేర్కొంది.

ప్రతి నిమిషానికి 34 బిర్యానీలు ఆర్డర్‌ వచ్చినట్టు వివరించారు. ఏడాది పొడవునా ప్రతి నిమిషానికి 21 చికెన్‌ బిర్యానీలు ఆర్డర్‌ వచ్చాయని పేర్కొంది. ఒక వినియోగదారుడు 60 బిర్యానీలను ఆర్డర్‌ చేయడానికి ఏకంగా రూ.18,840 రూపాయలు వెచ్చించినట్టు పేర్కొన్నారు. అంతే కాదు టీ20 ప్రపంచ కప్‌ సందర్భంగా 869 వేల చికెన్‌ బిర్యానీలు ఆర్డర్‌ వచ్చినట్టు తెలిపింది. అత్యధికంగా చికెన్‌ షావర్మాలను ఆర్డర్‌ చేసినట్టు పేర్కొంది. రాత్రిపూట భోజనం చేయడానికి ఒక వినియోగదారుడు ఒకే ఆర్డర్‌లో 30 బిర్యానీలు ఆర్డర్‌ చేశాడని వివరించింది. హైదరాబాద్‌లో అల్పాహారం దోసె, బ్రేక్‌ఫాస్ట్‌గా ఉల్లిపాయ దోస అత్యధికంగా ఆర్డర్‌ వచ్చిందని, ఇది దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంది. 17.54 లక్షల దోసెలు నగరవాసులు స్విగ్గీ నుంచి ఆరగించినట్టు తెలిపింది.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278