గుంటూరులోని శ్రీనివాసరావు తోటలో ఉంటే తులసమ్మ, అప్పారావు అక్కా తమ్ముళ్లు. పదేళ్ల క్రితం తులశమ్మ భర్త క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు. అయితే అప్పటి వరకూ తులసమ్మ చిన్న హోటల్ నిర్వహించేది. తులశమ్మ భర్త గుమాస్తాగా పనిచేసేవాడు. తులశమ్మ భర్తకు అనారోగ్యంగా ఉన్న సమయంలో నే తమ్ముడు అప్పారావు వచ్చి వారి దగ్గరున్న పది లక్షల రూపాయలు తీసుకొని పోస్టాఫీస్ లో ఫిక్డ్స్ డిపాజిట్ చేస్తానని తీసుకెళ్లాడు. సొంత తమ్ముడే కావడంతో ఆ డబ్బులు తులశమ్మ ఇచ్చి పంపించింది. ఆ తర్వాత తులశమ్మ వద్ద పలు దఫాలుగా ఇరవై లక్షల రూపాయలను వడ్డీగా తీసుకున్నాడు అప్పారావు. ఈ ఇరవై లక్షల రూపాయలకు గాను ప్రామిసరీ నోట్లు కూడా రాసిచ్చాడు. అయితే ప్రస్తుతం తులశమ్మ ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. కూతురి వద్దే నివసిస్తుంది. ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవాలంటే డబ్బులు కావాల్సి రావడంతో తమ్ముడి వద్దకు వెళ్లి డబ్బులివ్వాలంటూ అడిగింది. పోస్టాఫీస్‌లో పిక్స్ డ్ డిపాజిట్ తీసి ఇవ్వాలని అడిగింది. అయితే అసలు డిపాజిట్ తన పేరు మీదే లేదని చెప్పాడు తమ్ముడు అప్పారావు. అయితే వడ్డీకి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని ఇవ్వలేనంటూ తమ్ముడు అప్పారావు చెప్పాడు. వ్యాపారం చేసుకుంటూ డబ్బులు లేవని చెప్పడంతో తులశమ్మ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇదిగో అదిగో అంటూ ఆమెను తిప్పుతున్నారు.
0