అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు. దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. ఇలాంటి రాజకీయాలకు రేవంత్ రెడ్డి పెట్టింది పేరని విమర్శించారు. సమస్యలు చర్చకు రాకుండా అరెస్టులు, కేసులు.. ఇదే రేవంత్ రాజకీయం అని అన్నారు. రివెంజ్ సర్కార్, రివర్సుల సర్కార్ ఇది అని అన్నారు. ఈ రోజు మీడియతో చేసిన చిట్ చాట్ లో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వం 10 పర్సెంటేజ్ సర్కార్ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం కాదన్నారు. కొందరి కోసం మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. ప్రజల విద్యపై ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు.
తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిపై పోరాటం చేస్తామన్నారు. గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలు చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం వద్దన్నా తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రతిష్ఠిస్తామన్నారు. ఫ్రీ బస్సు అని చెప్పి ..బస్సుల సంఖ్య తగ్గించారని ధ్వజమెత్తారు. దివ్యాంగులు, మహిళలను బస్సుల్లో అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ బాయి బాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. కేటీఆర్ పై ఏసీబీ కేసు పెట్టిన మరుసటి రోజే ఈడీ కూడా కేసు పెట్టిందన్నారు. ప్రాంతీయ పార్టీ ఉండొద్దనేది కుట్ర జరుగుతోందన్నారు.
కానీ ఆ ప్రయత్నం సఫలం కానివ్వమని తేల్చిచెప్పారు. ఆరు గ్యారంటీలు అమలు చేసే అంత డబ్బులు సర్కార్ దగ్గర ఉందన్నారు. కానీ అమలు చేయడం లేదని విమర్శించారు. పెద్దల కాంట్రాక్టు బిల్లులు మాత్రమే ప్రభుత్వ పెద్దలు క్లియర్ చేస్తున్నారన్నారు. రేవంత్ సర్కార్ బతుకమ్మను నువ్వు దూరం చేసే కుట్ర చేస్తోందన్నారు. రేవంత్ పెట్టిన విగ్రహం కాంగ్రెస్ మాత అంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి గురుంచి నెట్ లో సెర్చ్ చేస్తే పెద్ద తెలంగాణ ఉద్యమకారుడు అని చూపించేలా వాళ్ల టీమ్ పనిచేస్తోందన్నారు.