అల్లు అర్జున్ ఇంటిపై OU JAC దాడితో వివాదం మరింత ముదిరింది. దాడి చేసిన వారిపై అల్లు అరవింద్ ఫిర్యాదు చేశారు. దీంతో దాడి చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వారిని రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్‌గా పోలీసులు గుర్తించారు.
ఈ ఆరుగురుని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి నిందితులపై BNS 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. దీంతో అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఈ ఆరుగురికి రిమాండ్ విధించింది.