manatelanganatv.com

పదేండ్లలో బీఆర్‌ఎస్‌ చేసింది 4.17 లక్షల కోట్లు మాత్రమే | అసెంబ్లీ సాక్షిగా కడిగి పారేసిన హరీశ్‌రావు

బీఆర్‌ఎస్‌ హయాంలో చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని, ఎవరైనా మళ్లీ రూ.7 లక్షల కోట్లు అని అంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 7 డిసెంబర్‌ 2023 నుంచి 31 మార్చి 2024 వరకు చేసిన అప్పు రూ.15,118 కోట్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అప్పుల ఖాతాలో వేశారని మరోసారి స్పష్టంచేశారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. అప్పులకు సంబంధించి కాంగ్రెస్‌ ప్రభుత్వం గోబెల్స్‌ ప్రచారం చేస్తూ బీఆర్‌ఎస్‌ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చేసిన అప్పులను కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఖాతాలో వేసి తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

కాంగ్రెస్‌ అప్పు బీఆర్‌ఎస్‌ ఖాతాలో వేస్తారా? ‘ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.6.71 లక్షల కోట్ల అప్పు చేసినట్టు చూపించారు. ఇది పూర్తిగా తప్పు. భట్టి విక్రమార్క తన మేధస్సుతో ఉమ్మడి ఏపీలో, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అప్పులను కూడా బీఆర్‌ఎస్‌ ఖాతాలో జమచేశారు. 7 డిసెంబర్‌ 2023లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. కానీ, మార్చి వరకు కాంగ్రెస్‌ చేసిన రూ.15,118 కోట్ల అప్పును కూడా కలిపి బీఆర్‌ఎస్‌ ఖాతాలో వేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన రూ.72,658 కోట్లను కూడా మా ఖాతాలోనే కలిపారు. 2014 కంటే ముందు గ్యారెంటీల పేరు మీద వారసత్వంగా వచ్చిన అప్పు రూ.11,609 కోట్లు బీఆర్‌ఎస్‌ ఖాతాలోనే వేశారు. ఈ విధంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేయని రూ.99,385 కోట్ల అప్పును బీఆర్‌ఎస్‌ ఖాతాలో వేసి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.40 వేల కోట్లు అదనంగా అప్పుల భారం పడింది’ అని వివరించారు. భట్టి విక్రమార్క చెప్పినట్టుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఆపాదించిన రూ.6.71 లక్షల కోట్ల అప్పులో బీఆర్‌ఎస్‌ చేయని అప్పు రూ.99,385 కోట్లు, ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేని రుణాలు రూ.1.54 లక్షల కోట్లు తీసేస్తే.. బీఆర్‌ఎస్‌ హయాంలో చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278