manatelanganatv.com

అమిత్‌ షాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి: మంత్రి పొన్నం

పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమిత్ షా రాజీనామా చేయాలంటూ విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కూడా పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్ నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను అవమానించిన అతిత్‌ షాను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. \

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను బీజేపీ అవమానిస్తే బీఆర్ఎస్‌ ఎందుకు మౌనంగా ఉంటుందో చెప్పాలి. విపక్ష పార్టీగా సభలో తీర్మానం ప్రవేశపెట్టి అమిత్ షాను భర్తరఫ్ చేయాలని, అరెస్టు చేసి జైల్లో పెట్టాలనే మాట ఎందుకు చెప్పడం లేదు. అమిత్‌ షాపై తెలంగాణ వ్యాప్తంగా దళిత సంఘాలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాయి. అంబేద్కర్‌ను అవమాన పరిచేలా దేవుడిని మొక్కితే ముక్తి దొరుకుతుందని చెప్పడం జాతిని అవమానపరిచ్చినట్టే. 

Leave a Comment