పలు యూట్యూబ్ వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రసాద్ బెహ్రా పై కేసు నమోదైంది. నీ బ్యాక్ బాగుంది అంటూ ఓ హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అందరి ముందు హీరోయిన్ తో అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
హీరోయిన్ ఫిర్యాదు మేరకు నటుడు ప్రసాద్ బెహ్రా మీద జూబ్లీహిల్స్ పీ ఎస్ లో కేసు నమోదవ్వగా.. తాజాగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కాగా ప్రసాద్ బెహ్రా రీసెంట్ గా వచ్చిన ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాలో నటించాడు. ఇందులో ప్రసాద్ బెహ్రా పెద్దోడు అనే పాత్రలో మంచి నటన కనబర్చాడు.
కమిటీ కుర్రాళ్లు’ మూవీతో ఈ సినిమాతో అతనికి మంచి గుర్తింపు కూడా వచ్చింది. మెగా డాటర్ నిహారిక నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.