తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్వోఆర్ -2020 చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు. పాత ఆర్వోఆర్ చట్టాన్ని రద్దు చేస్తూ.. అసెంబ్లీలో కొత్త ఆర్వోఆర్ బిల్లును ప్రవేశపెట్టారు.
ధరణి స్థానంలో..
దస్త్రాలు, భూయాజమాన్య హక్కుల చట్టం-2024 పేరుతో బిల్లును అసెంబ్లీలో విడుదలు చేశారు. ఇంతకు ముందు ఉన్న ధరణి స్థానంలో భూభారతి పేరుతో కొత్త వ్యవస్థను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఆధార్ నంబర్ లాగే ప్రతీ భూమికి కూడా భూధార్ కోడ్ ఉంటుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఆర్వోఆర్ యాక్ట్-2020ని ప్రక్షాళణ చేసి భూ భారతిని తెచ్చామన్నారు. మొత్తం 33 జిల్లాల ప్రజలు, మేధావుల అభిప్రాయాలతోనే ఈ బిల్లు నిర్ణయం తీసుకున్నామన్నారు. ధరణి పోర్టల్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. అందుకే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేసి.. కొత్త చట్టం పొంగులేటి తీసుకొచ్చామన్నారు