manatelanganatv.com

రేవంత్‌ పాలన మాకొద్దు!

రేవంత్‌రెడ్డి మాటకారే కానీ పనిమంతుడు కాదని, తెలంగాణ గురించి తెలిసిన ఏకైక నేత కేసీఆర్‌ ఒక్కరేనని తెలంగాణ ప్రజలు కుండబద్దలు కొట్టారు. జోగులాంబ దేవాలయం అలంపూర్‌ నియోజకవర్గం నుంచి మొదలుకొని భద్రాద్రి రామయ్య భద్రాచలం నియోజకవర్గం వరకు ప్రజలు ఒకే తీరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాలనలోనే సుఖ సంతోషాలతో ఉన్నామని, రేవంత్‌రెడ్డి పాలన తమకొద్దని ముక్తకంఠంతో చెప్తున్నారు. రేవంత్‌ పాలనతో సరిపోల్చినప్పుడు కేసీఆర్‌ పాలన 100 శాతం అద్భుతమని ప్రజలు తమ మనోగతాన్ని బయటపెట్టారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో హెచ్‌ఎంటీవీ, వోటా, కేకే, చాణక్య స్టాటిస్టిక్స్‌ తదితర సర్వే సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు చేశాయి. ప్రజానాడిని పట్టుకునే ప్రయత్నం చేశాయి. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినవి, చెప్పనివి కూడా చేశారని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీల మీద 82 శాతం మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సర్వేల్లో తేలింది. రానున్న సంస్థాగత ఎన్నికల్లో కేసీఆర్‌ బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేస్తామని మెజారిటీ ఓటర్లు చెప్పుకొచ్చారు.

వోటా సర్వేలో కేసీఆర్‌ టాప్

‌ఏడాది కాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సాధించినదేమిటి? చేయలేకపోయినదేమిటి? ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉన్నది? వంటి పలు అంశాలపై వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ అండ్‌ ఆంధ్రా (వోటా) సంస్థ 2024 నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 4 వరకు తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేసింది. సింపుల్‌ రాండమ్‌ విధానంలో చేసిన ఈ సర్వే కోసం 1677 శాంపిల్స్‌ సేకరించినట్టు వోటా సీఈవో కంబాలపల్లి కృష్ట మీడియాకు తెలిపారు. వీరిలో 57% మంది పురుషులు, 43% శాతం మహిళలు ఉన్నారు. పని ఆధారంగా నిరుద్యోగులు, రైతులు, కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, గృహిణులు, కార్మికులు, పెన్షనర్లు, చిరు వ్యాపారుల అభిప్రాయం సైతం సర్వే సంస్థ సేకరించినట్టు చెప్పారు. 18 ఏళ్ల నుంచి 65 ఏండ్లు, ఆ పైన వారి వరకు సర్వేలో పాల్గొన్నారు.

ఇద్దరు సీఎంల పరిపాలనలో ఎవరి పాలన బాగుందన్న ప్రశ్నకు కేసీఆర్‌ పాలన బాగుందని 44 శాతం మంది ప్రజలు తేల్చి చెప్పారు. రేవంత్‌రెడ్డి పాలన బాగుందని 30% మంది చెప్పినట్టు సర్వే నివేదించింది. సీఎంగా రేవంత్‌రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారన్న ప్రశ్నకు ఒక్కరంటే ఒక్కరు కూడా వందకు వంద మార్కులు వేస్తామని చెప్పలేదని, 59 శాతం మంది ఆయనకు 25 మార్కులు వేసి ఫెయిల్‌ చేసినట్టు వోటా సర్వే పేర్కొన్నది. 200 యూనిట్లలోపు వారందరికీ జీరో కరెంటు బిల్లు అమలు అవుతున్నదా? అన్న ప్రశ్నకు 50 శాతం మంది కొందరికే అమలు అవుతున్నని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి? అన్న ప్రశ్నకు బీఆర్‌ఎస్‌కు ఓటేస్తామని 39% మంది చెప్పగా, కాంగ్రెస్‌కే అని 30% మంది, ఎన్డీఏ కూటమికి వేస్తామని 19 శాతం మంది, ఇతరులకు వేస్తామని 7% మంది చెప్పినట్టు సర్వే ఫలితాల్లో వెల్లడించారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278