పార్లమెంట్‌కు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) పలు అంశాలపై వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. నిన్న ‘పాలస్తీనా’ (Palestine) బ్యాగ్‌తో పార్లమెంట్‌కు హాజరైన ప్రియాంక.. ఇవాళ ‘బంగ్లాదేశ్’ (Bangladesh) బ్యాగ్‌తో దర్శనమిచ్చారు.
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ‘బంగ్లాదేశ్ మైనారిటీల పక్షాన నిలవండి’ (Stand with minorities of Bangladesh) అంటూ రాసి ఉన్న బ్యాగ్‌తో పార్లమెంట్‌కు వచ్చారు. విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు సైతం ఇదే బ్యాగ్‌తో పార్లమెంట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు.
ప్రియాంక గాంధీ నిన్న పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్‌తో పార్లమెంట్‌కు హాజరయ్యారు. పాలస్తీనా సంఘీభావానికి చిహ్నంగా భావించే పుచ్చకాయ, శాంతి చిహ్నాలు వంటివి ఆ బ్యాగ్‌పై ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాలస్తీనాలోని గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ గళమెత్తారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజాలో ‘జాతి హత్య’లకు పాల్పడుతున్నదని ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీరును కూడా ఆమె నిందించారు. గత వారం ఢిల్లీలోని పాలస్తీనా రాయబార కార్యాలయం ఛార్జ్ డి అఫైర్స్ అబేద్ ఎల్రాజెగ్ అబు జాజర్ను కూడా ఆమె కలిశారు.