చంచల్ గూడా జైలు నుంచి విడుదలైన బన్నీ మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇది అనుకోకుండా జరిగింది. నేను చట్టాన్ని గౌరవిస్తాను. రేవతి కుటుంబానికి నా సానూభూతి. నాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ చంచల్ గూడా జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకోగానే.. బన్నీని చూసి భార్య స్నేహారెడ్డి, పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు. స్నేహారెడ్డి భర్తను పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంది.
చేయని తప్పుకు జైలుకు వెళ్లానంటూ..
ఇక జైలు నుంచి విడుదలై నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లాడు అల్లు అర్జున్. అయితే ఇంటికి డైరెక్ట్‌గా వెళ్లకుండా కార్యాలయానికి వెళ్లడంపై చర్చ మొదలైంది. గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే అల్లు అరవింద్, బన్నీ వాసు, సన్నిహితులుండగా.. నిన్న బెయిల్ వచ్చినా ఇవాళ రిలీజ్ అవ్వడంపై వారితో బన్నీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చేయని తప్పుకు జైలుకు వెళ్లానంటూ సన్నిహితుల వద్ద బన్నీ ఎమోషనల్ అయ్యారని, రాత్రి అంతా జైలులో నిద్రపోకుండానే ఉన్నట్లు తెలుస్తోంది. అతేకాదు ఈ కేసులో ఇకపై ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనేదానిపై చర్చ నడుస్తున్నట్లు సమాచారం.
జైలు అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు వేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఎంత దూరమైనా వెళ్లాలని లీగల్ టీమ్ కు చెప్పినట్లు సమాచారం. తండ్రి అల్లు అరవింద్‌కు కూడా ఇదే నిర్ణయం చెప్పిన బన్నీ.. ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చాను.. మళ్లీ వెళ్తా అంటూ బన్నీ ఎమోషనల్ అయ్యారట. ఇప్పటికే తన సన్నిహితులతో అల్లు అర్జున్ మంతనాలు జరిపారని, జైలుకు వెళ్లడాన్ని సవాల్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.