manatelanganatv.com

సంకెళ్లు సరికాదు.. ఐజీ

రైతు హీర్యానాయక్‌ చేతికి బేడీల ఘటనపై కంది సెంట్రల్‌ జైల్‌లో గురువారం రాత్రి మల్టీజోన్‌-2 ఐజీ సత్యనారాయణ, సంగారెడ్డి ఎస్పీ రూపేశ్‌ కలిసి విచారణ చేపట్టారు. ఐజీ మాట్లాడుతూ హీర్యాకు బేడీలు వేయ డం కరెక్ట్‌ కాదని చె ప్పారు. చికిత్స కోసం వికారాబాద్‌ పోలీసులు తీసుకెళ్లాల్సి ఉం టే, జైలు నుంచి సైబరాబాద్‌ పోలీసుల కు సమాచారం వెళ్లిందని, వారు వచ్చి తీసుకెళ్లారని తెలిపారు. వారికి హీర్యా నా యక్‌ లగచర్ల బాధితుడని తెలియక పోవచ్చని, ఏదో కేసులో ఉన్న ఖైదీ అనుకొని ఉండవచ్చని చెప్పారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

హీర్యానాయక్‌ఘటనలో అందరూ ముక్కున వేలేసుకునే అంశాలు వెలుగుచూస్తున్నాయి. లగచర్ల కేసులో నెలరోజులుగా కంది జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న హీర్యానాయక్‌ను బాలానగర్‌ కేసులో నిందితుడిగా పేర్కొన్నట్టు తెలుస్తున్నది. లగచర్ల ఘటనలో ఏ-2గా ఉన్న సురేశ్‌ సైతం జైలు నుంచి ఎవరికో ఫోన్‌కాల్స్‌ చేశాడని పోలీసులు అనుమానిస్తూ ఇదే కోణం లో విచారణ చేపడుతున్నారు. హీర్యానాయక్‌ను సంగారెడ్డి దవాఖానకు తరలించేందుకు కంది జైలు సిబ్బంది ఎస్కార్ట్స్‌ కోసం వికారాబాద్‌ జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి, సైబరాబాద్‌ పోలీసులకు చె ప్పారని, వారు వచ్చి హీర్యాకు బేడీ లు వేసి తీసుకెళ్లారని ఉన్నతాధికారులు చెప్పడం అనుమానాలకు తావిస్తున్నది.

జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారా? లేక పొరపా టు జరిగిందా? అన్నది తేలాల్సి ఉన్న ది. ఎక్కడి పోలీసులు అయినా రిమాం డ్‌ ఖైదీకి బేడీలు వేసుకొని ఎలా తీస్కెళ్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమతువున్నా యి. కాగా హీర్యాను తరలించే సమయంలో జైలు సిబ్బంది కూడా ఉన్నా రు. దీన్ని బట్టి చూస్తే హీర్యా బాలానగర్‌ కేసులో నిందితుడని పొరబడే అవకాశాలే లేవు! మరి పొరపాటు జరిగిందని ఎలా చెప్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

హీర్యానాయక్‌ లగచర్ల బాధితుడు అని తెలిసే అతడికి బేడీలు వేసి తీసుకెళ్లారని, ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడం, సీఎం రేవంత్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేయ డం వల్లే చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇలా‘పోలీసుల పరిధి’ని మా ర్చి చెప్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జైలులో ఉన్న సురేశ్‌ ఫోన్‌లో మాట్లాడుతూ గుండెనొప్పి వస్తున్నదని లాయర్లు, మీడియాకు చెప్తే గంటల్లోనే బెయిల్‌ వస్తుందని ఎవరికో చెప్పినట్టు భావిస్తున్నారు. జైలులో సురేశ్‌కు ఫోన్‌ మాట్లాడే అవకాశం ఎవరిచ్చారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కంది జైలర్‌ సస్పెన్షన్‌!: రైతుకు బేడీల ఘటనలో కంది సెంట్రల్‌ జైలు జైలర్‌ సంజీవరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడినట్టు తెలిసింది. జైలు సూపరింటెండెంట్‌ సంతోష్‌ రాయ్‌పై నా విచారణకు ప్రభుత్వం ఆదేశించిన ట్టు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు మల్టీజోన్‌-2 ఐజీ సత్యనారాయణ విచారణ జరిపారు. జైలు సూపరింటెండెంట్‌ సంతోష్‌ రాయ్‌తో పాటు, విధుల్లో ఉన్న జైలర్‌ సంజీవరెడ్డిని, ఇతర సిబ్బందిని విచారించారు.

ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించగా ఈ మేరకు జైలర్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. జైలు సిబ్బందితోపాటు బేడీలతో దవాఖానకు తీసుకువెళ్లిన పోలీసులపైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సున్నితమైన అంశం లో సరైన సమాచారం ఇవ్వని జైలర్‌, సూపరింటెండెంట్లపై చర్యలు తీసుకోవాలని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో జైళ్ల శాఖ డీజీ సూచించడం గమనార్హం.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278