హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పారామంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా ఇందిరా మహిళా శక్తి బజార్‌ను ప్రారంభిచారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులను విక్రయించడానికి మహిళా శక్తి బజార్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, ఇతర నాయకులు, అధికారులు హాజరైయ్యారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 106 షాపుల్లో మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు రైతు బజార్ తరహాలో వీటిని సిద్ధం చేశారు.
స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ స్టాల్స్కేటాయించారు. ఈ స్టాల్స్ లో చేనేత, హస్తకళలు, గృహ సంబంధిత వస్తువులు, అలంకరణ పరికరాలు, కళంకారి, జ్యువెలరీ, క్లాత్స్, ఇతర వస్తువులతోపాటు ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక బృందాల మహిళలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖాముఖి మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరలను చేయడమే ప్రభుత్వం లక్ష్యమని గుర్తుచేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి వచ్చిన గవర్నర్ జిష్ణదేశ్ శర్మకు కృతజ్ఞతలు చెప్పారు. సోలార్ పవర్ ప్రాజెక్టులలో ఆడబిడ్డలు అదానీ, అంబానీలతో పోటీ పడాలని ప్రభుత్వం నిర్దిష్ట కార్యక్రమంలో ముందుకు వెళుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇది నెరవేరాలంటే స్వయం సహాయక సభ్యుల సంఖ్య 65 లక్షల నుంచి కోటి మందికి చేరాలని ఆయన చెప్పారు. 2024లో ఆడబిడ్డల తరపున మహాలక్ష్మీ పథకం కింద రూ.4వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించామని వివరించారు. మహిళల్లో ఉన్న శక్తిని, నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటడానికే హైటెక్ సిటీలో స్టాల్స్ ఏర్పాటు చేసామని అన్నారు.
ప్రభుత్వం రూ.9 కోట్లు కేటాయించి స్టాల్స్ పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఇక్కడ దాదాపు 106 స్టాల్స్ఉండగా.. సుమారు ఏడేండ్ల నుంచి నిరుపయోగంగా ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వం స్టాల్స్‌ను పునరుద్ధరించి ప్రారంభించింది. ఈ పథకంతో గ్రామీణ ఉత్పత్తిదారులను పట్టణ, అంతర్జాతీయ వినియోగదారులతో అనుసంధానించడం ద్వారా మార్కెటింగ్ అవకాశాలు పెరిగే అవకాశం ఉందని మంత్రి సీతక్క తెలిపారు.