తమ్ముడి కుల కావరానికి లేడీ కానిస్టేబుల్ బలైపోయింది. కులాంతర వివాహం చేసుకుందని సొంత అక్కనే చంపేశాడు తమ్ముడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ఈ పరువు హత్య తెలంగాణ కలకలం రేపుతోంది.. కులాంతర ప్రేమ వివాహం చేసుకుందని కానిస్టేబుల్ నాగమణిని తమ్ముడు పరమేష్ నరికి చంపాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో జరిగింది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణి.. సోమవారం ఉదయాన్నే స్వగ్రామం రాయపోలు నుంచి హయత్‌నగర్ బయల్దేరింది.. ఈ క్రమంలో నాగమణి కోసం దారికాచిన తమ్ముడు పరమేష్.. ముందుగా కారుతో ఢీకొట్టి.. కత్తితో నరికి దారుణంగా చంపాడు..
పరమేష్ దాడిలో తీవ్రంగా గాయపడిన నాగమణి.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.. కాగా, నాగమణి నెలరోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది.. కులాంతర వివాహాన్ని జీర్ణించుకోలేని తమ్ముడు పరమేష్.. కిరాతకుడిగా మారి సొంత అక్కనే చంపడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు..