స్పెషల్ హాలిడే ప్యాకేజీ.. ఆకర్షణీయమైన ఆఫర్.. మంచి తరుణం మించిన తొరదకదు. షో.. ఈక్షణమే బుక్ చేసుకోండి. ఆల్రెడీ 90పర్సెంట్ సీట్లు బుక్ అయ్యాయి.. ఇంకా ఆలస్యమయ్యారో గోల్డెన్ ఛాన్స్ మిస్ అవుతారు. ఇలాంటి బురిడీ మాటలకు అట్రాక్ట్ అయ్యారో.. అడ్డంగా బుక్ అవుతారు. జోబులు ఖాళీ చేసి.. రోడ్డున పడేస్తారు.
500 మందిని మోసం చేసిన శ్రీ గాయత్రి టూర్స్ & ట్రావెల్స్
ఆకర్షణీయమైన ట్రావెల్ ప్యాకేజీలకు అట్రాక్ట్ అయ్యారో.. నిలువునా మోసపోతారు. దేశంలో యాత్రల పేరుతో పెద్ద దందానే నడుస్తోంది. దేశంలో టూర్స్ ట్రావెల్స్ ప్యాకేజీల గుట్టు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి. మొన్న నోయిడాలో ఓ కంపెనీ మోసం చేయగా.. ఇలాంటి ఘటనే ఇప్పుడు మన హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్ ఉప్పల్లోని శ్రీ గాయత్రి టూర్స్ & ట్రావెల్స్ యాత్రల పేరుతో 500 మందికి కుచ్చు టోపీ పెట్టింది. స్పెషల్ ఆఫర్స్ పేరుతో ఒక్కొక్కరి నుంచి 3వేల రూపాయలు వసూలు చేశారు. నిర్వాహకుడు భరత్ శర్మ.. 500 మంది నుంచి సుమారు 10కోట్లకు పైగా వసూలు చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని ఉప్పల్ పీఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీ గాయత్రి టూర్స్ & ట్రావెల్స్ నిర్వాహకుడు భరత్ శర్మను అరెస్ట్ చేశారు. రిమాండ్కు తరలించారు. దీనిపై ఎంక్వైరీ చేస్తున్నారు. ఇలాంటి మోసాలపై ఆరా తీస్తున్నారు.