తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మావోయిస్టులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. లగచర్ల ఘటనతోపాటు హైడ్రా తదితర అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు ఆపాలనిహెచ్చరించారు. అధికార ప్రతినిధి జగన్ పేరుతో రిలీజైన లేఖ సంచలనం రేపుతోంది.
హామీలను తుంగలో తొక్కింది..
రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం కాలం గడిచింది. సంవత్సర కాల కాంగ్రేస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పోరేట్ల ప్రయోజనాల కోసం దూకుడుగా పని చేస్తుంది. పౌర ప్రాధమిక హక్కులను, జీవించే హక్కును కాలరాస్తుంది. రాష్ట్రాన్ని కార్పోరేట్లకు కట్టపెట్టడానికి ఆర్ధిక అభివృద్ధి పేరుతో సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తూ కార్పోరేట్ సంస్థల విస్తృత పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్ ను ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) చేయడానికే ప్రపంచ స్థాయి హైదరాబాద్ (గ్లోబల్ హైదరాబాద్) నిర్మించే పేరుతో మూసీ నది సుందరీకరణ, రివర్ బెడ్ ప్రక్షాళన, హైదరాబాద్ లో అక్రమ కట్టడాల పేర్లతో రివర్ బెల్ట్ డెవలప్ మెంట్సే కార్పోరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డిసిఎల్), కార్యచరణ విభాగం హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఇండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ప్రత్యేక విభాగాలను ఏర్పరచి వాటికి విస్తృత అధికారాలను కట్టబెట్టి బుల్డోజర్ల పాలస కొనసాగిస్తున్నారు.
అధికార మదంతో దౌర్జన్యం..
మూసీ నదిని పర్యాకటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చారిత్రిక కట్టడాలను నిర్మించడానికి దేశీ, విదేశీ కార్పోరేట్ల వేల కోట్ల పెట్టుబడులను రేవంత్ ఆహ్వనించాడు. మూసి నది ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు స్వేచ్ఛమైన తాగు నీరు అందించడానికి పరిశుభ్రత చర్యలు చేపట్టడంలేదు. పరిశ్రమల నుండి, నగరం నుండి వెలుపడుతున్న వ్యర్థాలు, అనేక వ్యర్థ పదార్థాల నుండి ఏర్పడుతున్న కాలుష్యం, మురికి నీరు మూసి నదిలో చేరుతున్నాయి. వాటి నివారణ చర్యలు, నీటి శుద్ధి చేయకుండా వీటిన్నింటికి కారణం కేవలం మూసి పరివాహాక ప్రాంత ప్రజలను బాధితులను చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల పేరుతో అక్రమంగా నిర్మించిన ఐడా, బడా వ్యక్తుల, సంస్థల పెద్ద, పెద్ద అంతస్తులను వదిలేసి ప్రభుత్వాలు ఇచ్చిన అన్ని రకాల అనుమతులతో నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసం వుంటున్న మద్య తరగతి, పేద ప్రజలను అక్రమదారులుగా ప్రకటించారు. న్యాయ పరమైన అనుమతులు పక్కన పెట్టి, ప్రజలకు ఎలాంటి ముందుస్తు సమాచారం గాని, నోటీస్ లు గాని ఇవ్వకుండా అధికార మదంతో దౌర్జన్యంతో, ఆకస్మికంగా రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లతో కష్టజీవులు నిర్మించుకున్న నివాసాలను కూల్చేసి సాధారణ ప్రజలు జీవించే హక్కును హరించి వేస్తున్నారు.
వికరాబాద్ జిల్లా పూడూర్ మండలం దామగుండంలో విఎల్ఎఫ్ (వెరీ లో ప్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్(నేవీ రాడార్) స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కల్పించింది. దామగుండంలో నేవి రాడర్ స్టేషన్ నిర్మాణం కోసం రిజర్వ ఫారెస్టు 2900 ఎకరాల భూమిని అప్పగించారు. దీనితో సహజ సిద్ధమైన అనంతగిరికొండలున్న రిజర్వు ఫారెస్టు ద్వంసం అవుతుంది. అడవిపై ఆధారపడి జీవినం సాగిస్తున్న వేలాది మంది జీవించే హక్కును కోల్పోతున్నారు. కొడంగల్ నియోజవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో పార్మసిటిని నిర్మించి ప్రాకృతిక వనరులతో పాటు రైతుల పంట భూములను కొల్లగొట్టడానికి పథకం పన్నారు. భూములు కొల్పుతున్న రైతులు జీవన, మరణ పోరాటంలో లగచర్ల గ్రామ ప్రజలు మిలిటెంట్ ఉద్యమం చేపట్టారు. ప్రజలు న్యాయమైన పోరాటాన్ని వక్రీకరించి రైతులపై కేసులు పెట్టి బనాయించారు.
అదిలాబాద్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ప్రజోద్యమాన్ని అణిచివేయడానికి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉపాధ్యాయున్నింగరంగ విధుల నుండి సస్పెండ్ చేశారు. ప్రజల పక్షాన నిలిచి ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారు. కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణీయ హిందుత్వ కేంద్ర ప్రభుత్వం అంటకాగుతూ మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంలో విప్లవ కారులపై ఫాసిస్టు దాడులకు పూనుకున్నారు. కాంగ్రేస్ ప్రభుత్వం ఆదేశాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండలం దామెరతోగు గ్రామాల వద్ద వందలాది బలగాలను మోహరించి కా.నల్లమారి అశోక్ ను, ఇదే జిల్లాలో కరకగూడెం మండలం రఘునాధపాలెం గ్రామం వద్ద ఆరుగురి విప్లవకారులను పాశవికంగా హత్యలు చేశారు.