న్యాయంపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎగ్జిక్యూటివ్ అధికారులు న్యాయ ప్రక్రియను తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. నిందితులను దోషిగా చిత్రీకరించలేమని, దాని ఆధారంగా వాళ్ల ప్రాపర్టీలను నాశనం చేయడం సరికాదు అని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. కేవలం నిందితులో లేక దోషులో అయినంతమాత్రానా, వాళ్ల ఇండ్లను కూల్చడం రాజ్యాంగవ్యతిరేకమే అవుతుందని సుప్రీంకోర్టు చెప్పింది.
వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న వారి ఇండ్లను అక్రమంగా కూల్చుతున్నారని వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు న్యాయవిచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుల్లో తీర్పును ఇచ్చింది. నిందితుల ఇండ్లను కూల్చడం రాజ్యాంగ వ్యతిరేకం అని, అలాంటి చర్యలకు పాల్పడిన అధికారులపై పెనాల్టీ వేయాలని కోర్టు సూచించింది.
నిందితులు, దోషులకు కొన్ని హక్కులు ఉంటాయని కోర్టు చెప్పింది. బుల్డోజర్ల న్యాయంపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. రాత్రికి రాత్రే మహిళలు, చిన్నారులను వీధుల్లో చూడడం సంతోషకరమైన అంశం కాదు అని కోర్టు వెల్లడించింది. ఇండ్లను, అక్రమ ప్రాపర్టీలను ధ్వంసం చేసే ప్రక్రియను వీడియో తీయాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. ప్రజాభూమిలో అక్రమ నిర్మాణం చేపడితే తమ ఆదేశాలు ఆ కేసుల్లో అమల్లోకి రావు అని కోర్టు తెలిపింది.