manatelanganatv.com

ఫోన్‌ లిఫ్ట్‌ చేయని కలెక్టర్‌..ఎవరి పక్కాలో…అంటూ..!

మరోసారి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ ప్రభుత్వ ఉద్యోగిని మీద నోరు పారేసుకున్నారు. ఏకంగా జిల్లా కలెక్టర్నే తిట్టానంటూ ఆయన ఓ కార్యక్రమంలో చెప్పిన వాఖ్యలు నెట్టింట ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన ఫోన్ కలెక్టర్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆయన పీఏకి ఫోన్ చేసి.. కలెక్టర్‌ని తిట్టినట్లు చెప్పారు.
.
పదిసార్లు ఫోన్ చేసినా తన ఫోన్ ఎత్తకపోవడంతో కలెక్టర్‌ను తిట్టానంటూ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి జన్మదిన వేడుకలు జులైలో మైనార్టీ నాయకులు నాల్సాబ్ గడ్డ చౌరస్తా వద్ద నిర్వహించగా.. ఆ సమయంలో ఆయన తన జిల్లా కలెక్టర్‌ను ఉద్దేశించి ఉర్దూలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులో చూశాయి.

అయితే, ఆయన కలెక్టర్ పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించకుండా ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో పనిచేసిన కలెక్టరా, లేక ప్రస్తుతం ఉన్న కలెక్టర్ గురించా అన్నదాని గురించి ఆయన స్పష్టంగా వెల్లడించలేదు.

“కలెక్టర్‌కు పదిసార్లు ఫోన్ చేశాను కానీ నా ఫోన్ ఎత్తలేదు. కలెక్టర్ నా ఫోన్ ఎత్తకపోవడంతో కోపం వచ్చింది. వెంటనే పీఏకి ఫోన్ చేసి.. ఇంట్లో ఏమి చేస్తున్నారు కలెక్టర్ అని అడిగాను. నాకు కోపం వస్తే ఎలా తిడతానో మీకు తెలుసుగా. నేను పీఏకు చెప్పాను.. మీ కలెక్టర్ సాబ్ ఫోన్ ఎత్తటం లేదు, కలెక్టర్ ఆఫీసుకు రావటం లేదు, ఇంట్లో పడుకుంటున్నారు.

నేను ఏమి చెప్పానో మీకు అర్థమైందా? అర్థమైందా లేదా? ఇలా చెప్పగానే ఐదు నిమిషాల్లో కలెక్టర్ లైన్‌లోకి వచ్చారు. అధికారం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ జగ్గారెడ్డి గొంతుకకు దమ్ము విలువ ఉంది” అని అందుకే క్షణాల్లోనే కలెక్టర్ లైన్‌లోకి వచ్చారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జగ్గారెడ్డి వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఓ మహిళా కలెక్టర్ గురించి ఆయన మాట్లాడిన తీరును కొందరు విమర్శిస్తున్నారు.

జగ్గారెడ్డి ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఆ వీడియోలో జగ్గారెడ్డి అలా మాట్లాడారా.. లేదంటే ఎవరైనా మార్ఫింగ్ చేశారా అనే విషయం గురించి తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ వీడియోపై జగ్గారెడ్డి స్పందించలేదు. స్వయంగా ఆయన స్పందిస్తే మరింత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర వివాదాలకు దారి తీస్తున్నాయి. ఒక్కోసారి ఆయన వ్యాఖ్యలు సొంతపార్టీ నేతలను ఇరుకునపెడుతున్నాయి. ప్రస్తుతం జగ్గారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278