మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా గురువారం సాయంత్రం మేడ్చల్ ముస్లింలు మేడ్చల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పెద్ద మసీదు నుంచి ర్యాలీని ప్రారంభించి పట్టణంలోని ప్రధాన మార్కెట్,కింది బస్తి మీదుగా ర్యాలీ నిర్వహించి వికర్ సెక్షన్ కాలనీ వద్ద ముగించారు. ఈ ర్యాలీలో మేడ్చల్ పట్టణానికి చెందిన ముస్లిం పెద్దలు, సయ్యదినాయతలి, ఎండి రఫీక్, ఎండి ఆబేద్, ఎండి ఆరిఫ్, ఇమ్రాన్, ఎండి జమాల్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ముస్లింల కోసం మేడ్చల్ కౌన్సిలర్ రామన్న గారి మణికంఠ గౌడ్ కింది బస్తి ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద వాటర్ బాటిళ్లు, బిస్కెట్లు అందజేశారు
0