ఆ!’, ‘హిట్’ సినిమాలతో నిర్మాతగా సూపర్ హిట్లు అందుకున్న టాలీవుడ్ హీరో నాని తాజాగా మరో సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఆయన సమర్పణలో వస్తున్న తాజా చిత్రం ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. 2014లో వచ్చిన మరాఠీ బ్లాక్ బస్టర్ కోర్ట్ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తుండగా.. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిరినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ప్రియదర్శి మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ ఇవ్వగా… నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచాన్ చేశారు. తొలి సన్నివేశానికి నిర్మాత ‘జెమినీ’ కిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. ప్రియదర్శితో పాటు ఈ చిత్రంలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ యువకుడిని అన్యాయంగా కేసులో ఇరికించిన వాస్తవ ఘటన ఆధారంగా సినిమా తెరకెక్కుతోందని సమాచారం.
0