manatelanganatv.com

ఇండ్లు, బదిలీలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని టోకరా

ప్రభుత్వ ఉద్యోగాల్లో బదిలీలు చేయిస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని, డబుల్‌ బెడ్‌ రూమ్స్‌ ఇప్పిస్తానంటూ దాదాపు 107 మందిని మోసం చేసిన ముఠాని పోలీసులు పట్టుకున్నారు. రూ.కోటి 29లక్షలు వసూలు చేసినట్టు గుర్తించారు. ‘నేను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డిని మాట్లాడుతున్నాను’ అని చెప్పి కొందరు ప్రభుత్వ అధికారులకు ఫోన్‌లు చేసి నకిలీ బదిలీ ఆర్డర్‌ కాపీలు ఇవ్వడం, ‘నేను మల్కాజిగిరి ఆర్‌డీఓను మాట్లాడుతున్నా’ అని కొందరికి నకిలీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ పట్టాలు అందజేయడం, అదేవిధంగా ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని.. ఇలా దాదాపు 107 మందిని మోసం చేసిన ఆరుగురిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. కీసర పోలీసులు, మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్‌ వివరాలను శుక్రవారం ఎల్‌బీనగర్‌లో ఉన్న సీపీ క్యాంప్‌ కార్యాలయంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. కుషాయిగూడలోని వాసవి శివనగర్‌ కాలనీలో నివాసముంటున్న అనుగు సురేందర్‌రెడ్డి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హుస్నాబాద్‌ గ్రామం. ఇతను చెడు అలవాట్లకు బానిసై సులభంగా డబ్బులు సంపాదించాలని ఆలోచించాడు. ఓ మధ్యాహ్నం భోజన పథకం ఏజెన్సీలో అప్పుడప్పుడూ పని చేసేందుకు వెళ్తుండేవాడు. ఇదే క్రమంలో అతను తన ఇంటి పక్కనే ఉంటున్న మేరీనా రోజ్‌, మరో నలుగురితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. మిగతా నలుగురు నల్లగొండ జిల్లాకు చెందిన బోలుగుల అంజయ్య, కుషాయిగూడకు చెందిన బండ వెంకటేష్‌, కట్రావత్‌ గోపాల్‌ నాయక్‌, కీసరకు చెందిన అనుగు హర్షినిరెడ్డి కస్టమర్ల కోసం వెతికేవారు. ఈ క్రమంలో వారు తమకు సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి తెలుసని అమాయకులతో పరిచయం చేసుకున్నారు. అనంతరం సురేందర్‌రెడ్డి పలువురు బాధితులతో తాను వేం నరేందర్‌ రెడ్డిని మాట్లాడుతున్నానని పోన్‌లో మాట్లాడేవాడు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కావాలంటే, ఉద్యోగ బదిలీలు, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు సులభంగా నమ్మబలికి బాధితుల నుంచి డబ్బును రోజ్‌ బ్యాంక్‌ ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకునేవాడు. ఇలా ఉద్యోగ బదిలీల కోసం నకిలీ ఆర్డర్‌ కాపీలు ఇచ్చి ఏడుగురు బాధితుల నుంచి రూ.7 లక్షలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకు సంబంధించి 98మందికి నకిలీ పట్టాలు ఇచ్చి రూ.కోటి 4లక్షలు, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ ఆర్డర్‌ కాపీలు ఇచ్చి ఇద్దరి నుంచి రూ.18లక్షల 5వేలు వసూలు చేశారు. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితురాలు కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 8ఫోన్లు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నకిలీ పట్టాలు 98, రెండు నకిలీ ఆర్‌డీఓ స్టాంప్స్‌, రూ. కోటి 97లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సురేందర్‌ రెడ్డి గతంలో బెట్టింగ్‌ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. మీడియా సమావేశంలో మల్కాజిగిరి ఎస్‌ఓటీ డీసీపీ రమణా రెడ్డి, అడిషనల్‌ డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ శ్రీకాంత్‌ గౌడ్‌, కీసర ఇన్‌స్పెక్టర్‌ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278