జన్వాడ ఫౌంహౌస్ కూల్చోద్దంటూ కెటిఆర్ టీం కోర్టుకు వెళ్లింది. ఎఫ్ టిఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తుంది. జన్వాడ ఫౌంహౌస్ ఎఫ్ టిఎల్ పరిధిలో ఉండడంతో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. జన్వాడ ఫాంహౌస్ కూల్చకుండా స్టే ఇవ్వాలని కోర్టుకు ప్రదీప్ రెడ్డి వెళ్లారు.
కెటిఆర్ అక్రమంగా ఫార్మ్ హౌస్ నిర్మించారని హైడ్రా అధికారులు నోటీసులు అందించారు. గతంలో కెటిఆర్ ఫార్మ్ హౌస్ 111 పరదిలో ఉందని గ్రామ పంచాయతీ అనుమతితో అక్రమంగా కట్టారని రేవంత్ రెడ్డి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో డ్రోన్ ఎగరేసిన అంశంలో రేవంత్ పై కేసు కూడా నమోదు చేశారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారు. ఇప్పుడు మళ్లీ కెటిఆర్ కు సంబంధించిన జన్వాడ ఫౌంహౌస్ కూల్చోందేకు కుట్రలు జరుగుతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.