బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనానికి సంబంధించి బేరసారాలు జరుగుతున్నాయని, ఎప్పటికైనా బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం తథ్యమని సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈ విలీనంలో భాగంగా కేసీఆర్‌కు గవర్నర్, కేటీఆర్‌కు కేంద్రంలో మంత్రి పదవి, అపోజీషన్ లీడర్‌గా హరీశ్‌రావుకు పదవులు దక్కనున్నాయని చెప్పారు. ఇక రాజ్యసభలోని నలుగురు బీఆర్‌ఎస్ ఎంపీల విలీనానికి సమానంగా లిక్కర్ కేసులో కవితకు బెయిల్ రానుందన్నారు. అలాగే కవితకు రాజ్యసభ పదవి వస్తుందని కామెంట్ చేశారు. చిట్ చాట్‌లో భాగంగా రేవంత్ బీజేపీ, బీఆర్‌ఎస్ విలీనంపై స్పందించారు.
వాళ్లకే కార్పోరేషన్ పదవులు…
కాంగ్రెస్‌లో పార్టీ నేతలకే కార్పోరేషన్ పదవులు ఇస్తామని సీఎం అన్నారు. ఈ కార్పోరేషన్ పదవులు మూడేండ్లేనని… ఇప్పటి వరకు పార్టీలోని పలువురికి అవకాశం కల్పించామన్నారు. మిగిలిన వారికి నెక్ట్స్ రౌండ్‌లో ఛాన్స్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. మూడేండ్లు పీసీసీగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిం చానన్నారు. ఇప్పుడు ఆ బాధ్యతను అధిష్టానం ఎవరికైనా అప్పగించవచ్చన్నారు. తనను పీసీసీగా నియమించే టైంలో ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదని… ఇప్పుడు అలాగే ఉంటుందన్నారు. పార్టీ నియమించనంత వరకు తమ అభిప్రాయాలు చెప్తామని… . ఇచ్చిన తర్వాత ఎవరైనా తమ మనిషే అని చెప్పుకొచ్చారు.
0