బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని.. అందులో భాగంగానే కవితకు బెయిల్ రాబోతుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. కవితకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది న్యాయ స్థానం పరిధిలోని అంశం అన్నారు. కవిత బెయిల్ కు, బీజేపీకి ఏం సంబంధం? ఆప్ పార్టీని విలీనం చేసుకుంటేనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా? ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ రాజకీయ లబ్ది కోసం గౌరవ న్యాయస్థానంపై బురద చల్లి కోర్టుల ప్రతిష్టను తగ్గించడం దుర్మార్గం. బీజేపీని బదనాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు.
0