manatelanganatv.com

భార‌త ప్ర‌స్థానం ప్ర‌పంచానికే స్ఫూర్తిదాయకం: మోదీ

78వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్రకోటపై జాతీయ‌జెండాను ఎగురవేసిన అనంత‌రం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్ర‌సంగించారు. ముందుగా దేశ ప్ర‌జ‌ల‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపారు. భార‌త ప్ర‌స్థానం ప్ర‌పంచానికే స్ఫూర్తిదాయకం అని అన్నారు. 

హ‌ర్‌ఘ‌ర్ తిరంగా పేరుతో దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా వేడుక‌లు జ‌రుగుతున్నాయ‌న్నారు. దేశం కోసం త‌మ జీవితాల‌నే ప‌ణంగా పెట్టిన మ‌హనీయులు ఎందరో ఉన్నార‌ని, ఈ సంద‌ర్భంగా వారి త్యాగాల‌ను స్మ‌రించుకుందామ‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు. మ‌హనీయుల త్యాగాల‌కు ఈ దేశం రుణ‌ప‌డి ఉంద‌ని పేర్కొన్నారు. 

శ‌తాబ్దాల త‌ర‌బ‌డి దేశం బానిస‌త్వంలో మ‌గ్గింద‌ని, స్వాతంత్ర్యం కోసం ఆనాడు 40 కోట్ల మంది పోరాడార‌ని గుర్తు చేశారు. ఇవాళ దేశ జ‌నాభా 140 కోట్ల‌కు చేరుకుంద‌ని, మ‌న‌మంతా వారి క‌ల‌లను సాకారం చేయాల‌ని పిలుపునిచ్చారు. ల‌క్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాల‌ని తెలిపారు. 

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి వేడుకలు జరుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ ఏడాది వేడుకలకు దాదాపు ఆరు వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించినట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. 

వీరిలో రైతులు, యువత, మహిళలు, గిరిజన సంఘాల నాయకులు సహా అనేక మందికి ఆహ్వానం పంపారు. పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మొత్తం 117 మంది అథ్లెట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులను 11 బృందాలుగా విభజించ‌డం జ‌రిగింది.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278