ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నాణ్యతలేని అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు కొందరు నిర్వాహకులు. అధికారులు ఎన్ని దాడులు చేస్తున్న గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో చాటుగా నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు ఓ కేటుగాడు. విచిత్రం ఏమిటంటే అల్లం లేకుండానే వెళ్లుల్లిపాయలతో పేస్ట్ తయారు చేసి అల్లం కలర్ వచ్చేలా ఫుడ్ కలర్ కలిపి కల్తీ పేస్ట్ తయారు చేస్తూ ప్రజా ఆరోగ్యాలతో కలగటం ఆడుతున్నాడు. మేడ్చల్ జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ అత్వెళ్లి లో ఓ పురాతన ఇంట్లో ఈ దందా సాగిస్తున్నాడు ఓ ప్రభుద్దుడు. ఇదేటని ప్రశ్నిస్తే ఈ తయారీ కేంద్రానికి అన్ని అనుమతులు ఉన్నాయంటూ బుకాయిస్తున్నాడు. ప్రజనివాసాల నడుమ ఇలాంటి నాసిరకం తయారి కేంద్రాలు వెలుస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరు ప్రజలను పలు అనుమానాలకు దారి తీస్తున్నాయు. ఇలాంటి అనుమతులు లేని నాసిరకం తయారీ కేంద్రాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని మేడ్చల్ ప్రజలు కోరుకుంటున్నారు.
0